Monday, February 24, 2025

తమ ఇంగ్లీష్ యాస నష్టం కలిగించవచ్చన్న 62 శాతం భారతీయులు

- Advertisement -
- Advertisement -

ఇంగ్లీష్ భాష పరీక్ష స్కోర్‌పై వ్యతిరేక ప్రభావం చూపుతుందన్న భావన
పియర్సన్ సర్వే నివేదిక
న్యూఢిల్లీ : భారత్‌లో ఇంగ్లీష్ భాష పరీక్షకు హాజరయ్యేవారిలో 62 శాతం మందికిపైగా తమ భారతీయ యాస తమ భాషా పరీక్షపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని భావిస్తుండగా, ఒక వ్యక్తి పాత్ర ఉన్నప్పుడు తమ ఆహార్యం తమ పరీక్ష స్కోర్‌ను ప్రభావితంచేయవచ్చునని 74 శాతం మందికిపైగా అభిప్రాయం వ్యక్తం చేశారని పియర్సన్ సర్వే నివేదిక వెల్లడించింది. అధ్యయనం, పని, వలస వీసాల కోసం పియర్సన్ ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించిన సామాజిక భావన సర్వే నుంచి నివేదిక ఆ ఫలితాలను వెల్లడించింది. ముఖ్యంగా చూపులు,యాసలు, ఆహార్యాలకు సంబంధించిన పరీక్షార్థుల భావనలను నివేదిక వెల్లడిస్తూ, అభ్యర్థుల పరిజ్ఞానం, సామర్థాలపై ప్రధానంగా దృష్టి పెట్టే నిష్పాక్షిక విధానాలు అనుసరించవలసిన ఆవశ్యకత ఉందని నివేదిక సూచించింది. పని, చదువు లేదా వలస అవసరాలకోసం ఇంగ్లీష్ ప్రావీణ్యం పరీక్షకు హాజరైన లేదా హాజరు కావాలని అనుకుంటున్న వెయ్యి మంది అభ్యర్థులపై చేసిన సర్వే ఆధారంగా ఆ ఫలితాలు వెలువరించారు.

ఒక వ్యక్తి ప్రమేంతో ఇంగ్లీష్ భాష పరీక్ష అనుభవం బాగుందని 96 శాతం మంది అభ్యర్థులు తెలిపారు. సర్వే ప్రకారం, 59 శాతం మంది అభ్యర్థులు తమ చర్మం రంగు ఆధారంగా తమ పట్ల విభిన్నంగా ప్రవర్తిస్తారని భావిస్తున్నారు. లేత రంగు చర్మం ఉన్నవారి పట్ల అనుకోకుండా సానుకూలత ప్రకటించవచ్చుననే భయాన్ని వారు వ్యక్తం చేశారు. తాము దుస్తులు ధరించే తీరు తమపై తప్పుడు అభిప్రాయం కలిగించగలదని దాదాపు 64 శాతం మంది భావిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో పరీక్షార్థుల్లో ఈ భావనలు బలంగా ఉన్నాయి. అక్కడ 67 శాతం మంది ఆ భావనతో ఉన్నారు. ఉద్యోగ బాధ్యతలు, విద్య నేపథ్యం కూడా ప్రజల పట్ల ప్రవర్తనను ప్రభావితం చేస్తాయని భయపడుతున్నారు.

ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రలలో పది మంది అభ్యర్థుల్లో ఏడుగురు తమకు ప్రతిష్ఠాకర ఉద్యోగం లేదా గట్టి విద్యా నేపథ్యం ఉంటే తమను మరింత గౌరవంగా చూస్తారని విశ్వసిస్తున్నారు. సర్వే ప్రకారం, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడులలో ఐదుగురిలో ముగ్గురికి పైగా (63 శాతం మంది)ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు తమ భారతీయ యాసలను తొలగించడం పరీక్ష స్కోర్లపై సకారాత్మక ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. బయటకు కనిపించే తీరు కూడా ఫలితాలను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. పంజాబ్‌లో ఆ భావన చాలా బలంగా ఉన్నది.

ఆ రాష్ట్రం నుంచి 77 శాతం మంది అభ్యర్థులు తమ ఆహార్యం తమ మాట్లాడే పరీక్ష ఫలితాలను ప్రభావితం చేయగలదని భావిస్తున్నారు. ‘భారత్‌లో అనేక సంవత్సరాలుగా తమ యాసలు, ఆహార్యాల గురించిన జనం భయాలు వారికి లభించే అవకాశాలను తేల్చాయి, తుదకు వారి ఆర్జన శక్తినని ప్రభావితం చేశాయి. ప్రజల భవిష్యత్తులు తరచు తేలవలసిన అత్యంత కీలక పరిస్థితుల్లోను ఇది కానవచ్చింది. ఇంగ్లీష్ భాష పరీక్ష, విస్తృత ప్రపంచ ప్రయాణ అవకాశం కూడా ఈ సవాళ్లను తప్పించుకోలేకపోయాయి. అయితే, పియర్సన్‌లో మేము ఈ పరిస్థితులను మారుస్తున్నాం’ అని పియర్సన్ ఇండియా ఇంగ్లీష్ భాష అధ్యయనం విభాగం డైరెక్టర్ ప్రభుల్ రవీంద్రన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News