Monday, February 24, 2025

భారత్‌లో 7 ప్రాజెక్టులకు యుఎస్ ఎయిడ్ నిధులు

- Advertisement -
- Advertisement -

అవి ‘వోటర్ల సంఖ్య పెంపుదల’తో సంబంధం లేనివి
ఆర్థిక మంత్రిత్వశాఖ నివేదిక

న్యూఢిల్లీ : భారతీయ ఎన్నికలపై ప్రభావంలో యుఎస్ ఎయిడ్ పాత్ర ఉందనే ఆరోపణలతో రాజకీయ వివాదం రేగుతున్న నేపథ్యంలో ఆ సంస్థ 202324లో 750 మిలియన్ డాలర్లు విలువ మేరకు ఏడు ప్రాజెక్టులకు నిధులు సమకూర్చిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తాజా వార్షిక నివేదిక వెల్లడించింది. 202324కు సంబంధించిన ఆర్థిక మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం, ‘ప్రస్తుతం భారత ప్రభుత్వంతో భాగస్వామ్యంలో యుఎస్ ఎయిడ్ మొత్తం 750 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో ఏడు ప్రాజెక్టులను అమలు చేస్తోంది’. 202324 ఆర్థిక సంవత్సరం కోసం ఏడు ప్రాజెక్టుల కింద యుఎస్ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యుఎస్ ఎయిడ్) మొత్తం రూ. 97 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 825 కోట్లు) మేరకు బాధ్యత తీసుకుందని ఆ నివేదిక తెలియజేసింది.

ద్వైపాక్షిక ఆర్థిక సహాయ పథకాలకు సంబంధించిన నోడల్ విభాగమైన ఆర్థిక మంత్రిత్వశాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఆ నివేదికలో 202324లో నిధులు సమకూర్చిన ప్రాజెక్టుల వివరాలు కూడా పంచుకున్నది. ఆ సంవత్సరం వోటర్ల సంఖ్య పెంపుదల కోసం ఏవిధమైన నిధులూ సమకూర్చలేదు. కానీ వ్యవసాయ, ఆహార భద్రత కార్యక్రమం, నీరు, పారిశుద్ధం, హైజీన్ (వాష్), పునర్వినియోగ ఇంధన శక్తి, విపత్తు నిర్వహణ, ఆరోగ్య రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఎలాన్ మస్క్ సారథ్యంలోని డోజ్ (ప్రభుత్వ సామర్థ విభాగం) తాము ‘వోటర్ల సంఖ్య’ పెంపుదల కోసం భారత్‌కు 21 మిలియన్ డాలర్ల గ్రాంట్‌ను రద్దు చేశామని ప్రకటించిన తరువాత ఈ నెల ప్రథమార్ధంలో రాజకీయ వివాదం రేగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News