14,000 పరుగుల మార్క్ అందుకున్న విరాట్ కోహ్లీ
దుబాయ్: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి బ్యాటర్‌గా నిలిచాడు. పాకిస్థాన్‌తో జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. హ్యారిస్ రౌఫ్ వేసిన 13వ ఓవర్‌లో రెండో బంతిని కోహ్లీ తన ట్రేడ్ మార్క్ కవర్ డ్రై షాట్‌తో బౌండరీ బాది ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఆల్‌టైమ్ వరల్ రికార్డ్‌ను కోహ్లీ అధిగమించాడు. కాగా, సచిన్ టెండూల్కర్ 350 ఇన్నింగ్స్‌ల్లో 14వేల పరుగుల మైలురాయి అందుకుంటే విరాట్ కేవలం 287 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. 378 ఇన్నింగ్స్‌ల్లో కుమార సంగక్కర ఈ మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ టెండూల్కర్(18426) టాప్‌లో ఉండగా.. కుమార సంగక్కర (14234), విరాట్ కోహ్లీ(14007) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
సచిన్ రికార్డు బద్దలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -