Monday, February 24, 2025

బురద నీరే సవాల్

- Advertisement -
- Advertisement -

ఎస్‌ఎల్‌బిసి సహాయక చర్యల్లో సమస్యలెన్నో 8 మంది బాధితుల సంక్షేమంపై సర్వత్రా టెన్షన్

శ్రమిస్తున్న ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, సైనిక
బృందాలు టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు చేరిక
నేడు రంగంలోకి నేవీ ప్రత్యామ్నాయ మార్గాల
అన్వేషణ సొరంగంలో రాకపోకలకు ఒకే
మార్గం కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు
ట్రాక్, సిపేజ్ వాటర్, ఆక్సిజన్ పైపులైన్ల
పునరుద్ధరణలో సవాళ్ళు స్వయంగా ఎస్‌ఎల్‌బిసి
సొరంగంలోకి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించిన
మంత్రులు జూపల్లి, ఉత్తమ్ రెస్కూ టీమ్‌లకు
దిశానిర్దేశం సిఎం రేవంత్‌కు రాహుల్ ఫోన్
సహాయక చర్యలపై ఆరా మంత్రులు, అధికారులతో
సిఎం రేవంత్ రెడ్డి నిరంతర సమీక్ష, సూచనలు

ఎండి అహ్మదుల్లా ఖాన్/నాగర్‌కర్నూల్ ప్రతినిధి:
జిల్లాలోని అమ్రాబాద్ మండలం, దోమలపెంట వద్ద నిర్మాణంలో ఉన్న ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ పనుల్లో శనివారం సొరంగం కూలీల ఘటన 8 మంది చిక్కుకున్న విషయం విధితమే. 36 గంటలుగా నిర్విరామంగా అధికారులు, రెస్కూ టీం సభ్యులు, ఏజెన్సీకి చెందిన ఇంజినీర్లు సిబ్బంది, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఆర్మీ, హైడ్రా బృందాలు కృషి చేస్తున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు లోకో ట్రైన్‌లో ఆ యా బృందాలతో కలిసి మంత్రి జూపల్లి కృ ష్ణారావు సాయంత్రం 6 గంటల 40 నిమిషాల వరకు దగ్గరుండి రెస్కూ ప నులను పర్యవేక్షించారు. 13.5 కిలోమీటర్ల దూరంలోని సొరంగం లోపలి భా గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎలాగైనా టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది ప్రాణాలు కాపాడే విధంగా ప్రణాళికాబద్ధంగా ముం దుకు సాగుతున్నా నీటి ఊట, కూలిన సొరంగంలోని మట్టి బురదగా మారి సహాయక చర్యలకు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది.

దీంతో పాటు టన్నెల్ బోరింగ్ మిషన్ వరకు ఉన్న సర్ఫేస్ నీటి పంపింగ్ పైప్ లైన్‌లు, మోటర్లు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆక్సిజన్ అందించే ప్రత్యేక పైపులు సైతం శనివారం నాటి సంఘటనలో ధ్వంసమైనట్లు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది. దీంతో పాటు లోకో ట్రైన్ పట్టాలు సైతం ధ్వంసం కావడంతో వాటిని పునరుద్ధరించడం పూర్తికావడంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మంత్రులు, వివిధ శాఖల అధికారులు రెస్కూ టీం బృందాలు అక్కడికి చేరుకోగలిగినట్లు స్పష్టమవుతోంది. ఎస్‌ఎల్‌బిసి సొరంగ మార్గంలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిం ది. దేశమంతా టన్నెల్‌లో చిక్కుకున్న ఇంజినీరింగ్ అధికారులు, కార్మికుల గురించే సర్వత్రా ఆందోళన నెలకొం ది. ఇదిలా ఉండగా 43 కిలోమీటర్ల మేర నిర్మాణం చే యాల్సిన ఎస్‌ఎల్‌బిసి సొరంగం పనులలో ఇప్పటివరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు పూర్తి అయినట్లు అధికారుల ద్వారా అందిన సమాచారం మేరకు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా శనివారం నాటి సొరంగం కూ లిన ఘటనలో 8 మంది టన్నెల్ బోరింగ్ మిషన్ పనిచేస్తున్న స్థానంలో చిక్కుకున్నాయి. 9 మీటర్ల పొడవు, సు మారు 20 మీటర్ల వ్యాసార్థం ఉన్న సొరంగంలో మట్టి, రాళ్లు కూలిన ఘటనలో పనుల నిమిత్తం ఏర్పాటు చేసిన నీటిని ఎత్తిపోసి పైప్‌లైన్‌లు, ఆక్సిజన్ పైప్‌లైన్, విద్యుత్ లైన్‌లు, లోకో ట్రైన్ ప్రయాణం చేయడానికి ఏర్పాటు చేసిన ట్రాక్ ధ్వంసం కావడంతో సహాయక చర్యలకు ఆలస్యం జరిగినట్లు స్పష్టమవుతోంది. ఆదివారం మధ్యా హ్నం ఒంటి గంటకు పునరుద్ధరణ పనులు పూర్తి అయిన తర్వాతే మంత్రి జూపల్లి కృష్ణారావు ఇతర అధికారులు, రెస్కూ టీం బృందాలతో వెళ్లారు. మధ్యాహ్నం వరకు ట్రాక్ పనులు విద్యుత్ పనులు పూర్తి కాగా నీటిని తోడివేసే పైప్‌లైన్ పనులు ఆక్సిజన్ అందించే పైప్‌లైన్ పను లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

ఇదిలా ఉండగా 9 మీటర్ల లోపల చిక్కుకున్న ఇంజినీర్లు, కార్మికులు, ఇతర టెక్నికల్ సిబ్బంది ఎనిమిది మందికి ఆక్సిజన్ అందించడానికి అహర్నిశలు రెస్కూటీం బృందాలు పనిచేస్తున్నా యి. మట్టి దిబ్బలను తొలగించడమా… లేదా కూలిన మట్టిదిబ్బల పై నుంచే గొట్టాల ద్వారా ఆక్సిజన్ అందించాలా అనే దానిపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.

మట్టి దిబ్బలు తొలగిస్తేనే చిక్కుకున్న వారి ఆచూకీ

సొరంగంలో కూలిపడ్డ తొమ్మిది మీటర్ల మేర ఉన్న మట్టి దిబ్బలు, రాళ్లను తొలగిస్తే తప్ప సొరంగంలో చిక్కుకున్న వారి యోగక్షేమాలు తెలిసే అవకాశాలు లేవని చెప్పవచ్చు. ఇప్పటికి సహాయక బృందాలకు ఆక్సిజన్ అం దించే ప్రక్రియతో పాటు సొరంగంలో చిక్కుకున్న వారికి సైతం ఆక్సిజన్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సొరంగంలో టెన్షన్..! టెన్షన్…!!

సొరంగంలో చిక్కుకున్న ప్రాజెక్టు ఇంజనీర్, ఫీల్డ్ ఇంజినీర్లతో పాటు మరో నలుగురు కార్మికుల యోగక్షేమాలపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఒక పక్క చిక్కుకున్న వారి ని కాపాడాలన్న తాపత్రయం, మరో పక్క సొరంగంలో సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన టెక్నికల్ సమస్యలతో సొరంగంలో టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. సొరంగంలో చిక్కుకున్న వారికి ఆక్సిజన్ అం దించడం ఒక ఎత్తు అయితే మట్టిదిబ్బలను తొలగించడం పెద్ద సవాల్‌గా మారినట్లు తెలుస్తోంది. 13.5 కిలోమీటర్ల మేర లోకో ట్రైన్ ప్రయాణించి సొరంగం బయటికి రావాలంటే సుమారు 45 నిమిషాలకు పైగాను పడుతుందని సమాచారం, సొరంగంలో కూలిపడ్డ మట్టి దిబ్బలు తొలగించి బయటికి తరలించాలంటే లోకో ట్రైన్ సామర్థం సరిపోతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టెక్నికల్‌గా మట్టిని సొరంగంలో రెండు వైపులా ఘటన జరిగిన చోటు నుంచి పక్కకు నెట్టేసి లోకో ట్రైన్ ఘటన జరిగిన స్థలానికి చేరుకునే విధంగా పనులు ముమ్మరం చేసినట్లు సమాచారం.

రెస్కూ…! రిస్కే…?

14 కిలోమీటర్ల మేర భూగర్భంలో ఉన్న సొరంగంలో రెస్కూ నిర్వహించడం రిస్కే నా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భూగర్భంలో 20 మీటర్ల వ్యాసార్థంలో ఉన్న టన్నెల్ లోపలి భాగంలో సహాయక చర్యలు చేపట్టడం రెస్కూ టీంకు పెద్ద సవాల్‌గానే చెప్పవచ్చు. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండే సొరంగంలో లోపలికి వెళ్తున్న కొద్ది ఇబ్బందులు తప్పవు. టెక్నికల్‌గా ఆక్సిజన్ అందించే ప్రక్రియను క్రమక్రమంగా పునరుద్ధరించుకుంటూ ముందుకు సాగడమే టీం ముందు ఉన్న పెను సవాల్‌గా చెప్పవచ్చు. ఆదివారం రాత్రి వరకు టెక్నికల్ అంశాలను అధిగమించి మట్టిని తొలగించే పనులు చేపడితే ఎంత సమయం వరకు సొరంగంలో చిక్కుకున్న వారిని చేరుకుంటారన్నది సర్వత్రా ఉత్కంఠగా ఉంది.
సొరంగ మార్గం ద్వారా కాకుండా ప్రత్యామ్నాయంగా నేరుగా ఘటన జరిగిన చోటుకు తవ్వకాలు చేపడితే సహాయక చర్యలకు సమయం తక్కువ పడుతుందన్న చర్చ కూడా జరిగినట్లు సమాచారం. లోయలు, అడవుల మధ్య నిర్మాణంలో ఉన్న సొరంగం వరకు భూమి ఉపరితలం నుంచి 400 మీటర్ల దూరం ఉన్నట్లు అధికారులు సమీక్షలో చర్చించినట్లు తెలిసింది.

సొరంగంలో పరిస్థితిని సమీక్షించిన జూపల్లి

మంత్రి జూపల్లి కృష్ణారావు ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌లో 6.30 గంటల పాటు గడిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు లోకో ట్రైన్‌లో వెళ్లిన మంత్రి, అధికారులు, రెస్కూ టీం బృందాలు సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు బయటకు వచ్చారు. రెస్కూ టీం బృందాలు, ఇతర టెక్నికల్ ఇంజినీర్లతో సహాయక చర్యలపై దిశానిర్దేశం చేశారు. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎలాంటి చర్యలకు కూడా వెనుకాడవద్దని సూచించినట్లు సమాచారం. ఆదివారం ఉదయం దోమలపెంటకు హెలికాప్టర్ ద్వారా చేరుకున్న మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు టన్నెల్ నిర్మాణం సంస్థ ప్రతినిధులు, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, మిలిటరీ, హైడ్రా బృందాలతో పాటు కలెక్టర్లు, ఎస్‌పిలతో కలిసి సమీక్షలు నిర్వహించారు. సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న సిబ్బందితో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. సొరంగం లోపలి భాగంలో జరుగుతున్న సహాయక చర్యలు అవాంతరాలు అవసరాలను ఎప్పటికప్పుడు వాకిటాకీల ద్వారా సమాచారం తెలుసుకుంటూ సమీక్షలో అధికారులతో నిమగ్నమయ్యారు. సొరంగ మార్గం ద్వారా టన్నెల్ బోరింగ్ మిషన్ వరకు ఆక్సిజన్, నీరు, విద్యుత్ అందించే పైపులు, విద్యుత్ తీగలు ధ్వంసం కావడంలో అందులో చిక్కుకున్న వారి యోగక్షేమాల పైనే సర్వత్రా చర్చ సాగుతోంది. గతంలో అనేక ప్రాంతాలలో జరిగిన ఘటనలను కొందరు ప్రాణాలతో బయటపడిన అంశమే కాస్త ఆశ కలిగిస్తున్నా అక్కడి పరిస్థితులకు ఇక్కడి పరిస్థితులకు ఉన్న తేడా గురించే సర్వత్రా చర్చ జరుగుతోంది.

డిజాస్టర్ మేనేజ్మెంట్ చీఫ్ సెక్రటరీ సమీక్ష

దోమలపెంటలో ఆదివారం ఎస్‌ఎల్‌బిసి వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలను రాష్ట్ర డిజాస్టర్ మేనెజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సమీక్షించారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో ఘటనకు సంబంధించిన వివరాలు, సహాయక చర్యల్లో అవాంతరాలు చేపడుతున్న రెస్కూ ఆపరేషన్ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.
సమీక్షలో డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరి అరవింద్ కుమార్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, టిఎస్‌పిడిసిఎల్ ముషారఫ్ అలీ, డిఐజి ఎల్ ఎస్ చౌహాన్, నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్‌పి గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News