Monday, February 24, 2025

పరిస్థితులు భయానకం

- Advertisement -
- Advertisement -

సొరంగం లోపల 5వేల క్యూబిక్
మీటర్ల బురద మట్టి
పేరుకుపోయినట్లు ప్రాథమిక
అంచనా ఏది ఏమైనా
సహాయక చర్యల్లో లోటుపాట్లు
లేకుండా మరింత ముమ్మరం
చేస్తాం ఎస్‌ఎల్‌బిసి
టన్నెల్‌లో పరిస్థితులను
వివరించిన మంత్రి జూపల్లి

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: ఎస్‌ఎల్‌బిసి సొరంగంలో జరిగిన ఘటన దృశ్యాలు భయానకంగా ఉ న్నాయని, పరిస్థితులు ఆశాజనకంగా లేకున్నా సహాయక చర్యల్లో లోటు రానివ్వబోమని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శా ఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా, దోమలపెంట వద్ద కృష్ణానది ఆధారంగా నిర్మాణంలో ఉన్న ఎస్‌ఎల్‌బిసి సొరంగం వద్ద సహాయక పనులను మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6.40 గంటల వరకు ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, హై డ్రా, ఆర్మీ బృందాలతో కలిసి ఘటన స్థలాన్ని క్షేత్రస్థాయి లో పరిశీలించారు.

అనంతరం ఆయా సంస్థలకు సంబంధించిన నిపుణులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సుమారు 13.5 కిలోమీటర్లు లోకో ట్రైన్‌లో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన అనంతరం దోమలపెంటలో విలేకరులతో మాట్లాడుతూ.. ఘటన స్థలంలో పరిస్థితులు భయానకంగా ఉన్నాయన్నారు. సొరంగంలో కూలిన మట్టికి, సొరంగంలో నీటి ఊట పెరగడంతో టన్నెల్ బురదమయంగా మారిందన్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో భాగంగా నేవీ బృందాన్ని ఆదివారం రాత్రికి రప్పిస్తున్నామని తెలిపారు. సహాయక చర్యలు చేపట్టడానికి పరిస్థితులు ఆశాజనకంగా లేవని వివరించారు. 5 వేల క్యూబిక్ మీటర్ల మట్టి పేరుకుపోయినట్లు ప్రాథమికంగా తమ దృష్టికి వచ్చిందన్నారు. ఏదేమైనా సహాయక చర్యలను ముమ్మరంగా చేసి ఘటనా స్థలంలో చిక్కుకున్న వారిని బయటికి తీసే ప్రయత్నం కొనసాగిస్తామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News