Monday, February 24, 2025

గుట్ట గోపురం స్వర్ణ శోభితం

- Advertisement -
- Advertisement -

భక్తులకు అంకితమిచ్చిన ముఖ్యమంత్రి
రేవంత్‌రెడ్డి, సిఎం దంపతుల ప్రత్యేక పూజలు
వేలాదిగా దర్శించుకుంటున్న భక్తులు మార్చి
1నుంచి గుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్టలో వైభవంగా దివ్య విమాన బంగారు గోపురం సంప్రోక్షణ

మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బంగారు విమాన గోపుర మహాకుంభాభిషేకం, సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమం ఆదివారం వైభవోపేతం గా జరిగింది. దేశంలోనే ఎత్తైన స్వర్ణ గోపురం 50.5 అడుగులు, 10,759 చదరపు అడుగుల వై శాల్యం, రూ.80కోట్ల విలువైన 68 కిలోల బంగా రం, రూ.3.90 కోట్ల ఖర్చుతో కూడిన బంగారపు స్వర్ణ గోపురం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి అంకితమైంది. స్వామి వారి బంగా రు విమాన గోపుర మహాకుంభాభిషేకం, సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమం ఆదివారం ఉదయం 11.54 గంటలకు వానమామలై మఠం 31 పీఠాధిపతి, మధుర కవి రామానుజ జీయర్‌స్వామి దివ్య మంగళ శాసనాలతో వేద పండితులు, రుత్విక్కులు, పారాయణాలు, భక్తుల జయజయధ్వానాలు, వేదమంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వామివారి బంగారు విమాన గోపురాన్ని లక్ష్మీనరసింహస్వామి వారికి అంకితం ఇచ్చారు. రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు సతీమణితో చేరుకున్న సిఎం ముందుగా గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు.

అక్కడి నుంచి పంచకుండాత్మక యాగం జరిగిన యాగస్థలికి చేరుకొని మహా పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఉత్తర రాజగోపురం నుంచి నేరుగా స్వర్ణ గోపురంపైకి చేరుకున్నారు. రాజగోపురాన్ని 40 జీవనదుల జలాలతో అభిషేకించి సంప్రోక్షణ చేశారు. అనంతరం స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణ క్రతువును వైదిక బృందం వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించింది. మహా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం త్రితల రాజగోపురం నుంచి ఆలయంలోకి చేరుకున్నారు. అనంతరం గర్భగుడిలో సిఎం రేవంత్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వాదం ఇచ్చారు. అద్భుత కృష్ణ శిల్పకళా వైభవంతో నిర్మితమైన యాదగిరిగుట్ట ఆలయం ఇకపై స్వర్ణమయ శోభితమైన భక్తులను కనువిందు చేయనుంది. సిఎం వెంట సిఎస్ శాంతికుమారి, ఎంఎల్‌ఎలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బాలు నాయక్, ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఇఓ భాస్కర్ రావు, బండ్రు శోభారాణి, అమిత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

125 కేజీల బదులు 68 కేజీలతోనే తాపడం పూర్తి

2021 నాటికి గోపురానికి తాపడం చేయడానికి 125 కేజీల బంగారం అవసరమని అప్పటి ప్రభుత్వం అనుకుంది. కానీ ఈ అంచనా మలు దాదాపు డబులైంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు 68 కేజీలతోనే తాపడం పూర్తి చేసింది. ఏది ఏమైనా ఈ బంగారు గోపురం అయ్యే వరకూ భక్తుల్లో కొంత అసంతృప్తి అలాగే ఉండిపోయింది. ఇప్పుడు స్వర్ణ గోపురం కారణంగా యాదగిరిగుట్టను చూస్తే తిరుమల శ్రీవారి ఆలయాన్ని చూసినట్లే ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గత ప్రభుత్వం మొదలు పెట్టిన ప నులను చకచకా పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జోరుగా కొన సాగించింది. మార్చి 1 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు యాదగిరి గుట్టలో జరుగుతాయి. ఆలోపే ఈ స్వర్ణ గోపురం పనులు పూర్తి కావడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. ఇకపై ఈ ఆలయానికి వెళ్లే వారికి సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి లభిస్తుందని ఆలయ అధికారులు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News