Monday, February 24, 2025

ఇంజమామ్ లక్షణాలు అల్లుడు ఇమాముల్ హక్ కు వచ్చాయి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఛాంపియన్ ట్రోఫీలో పాక్ పై భారత్ ఘన విజయం సాదించింది. పాకిస్తాన్ ఓపెనర్ ఇమాముల్ హక్ రనౌట్ అనే అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్రికెట్ చరిత్రలో అత్యధిక రనౌట్లు పాక్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ పై రికార్డు ఉంది. ఇంజమామ్ భారీ కాయుడు కావడంతో వికెట్ల మధ్య పరుగులు తీయలేక రనౌట్ అయ్యేవాడు.

భారత్ పాక్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇమాముల్ హక్ రనౌట్ కావడంతో ఇంజమామ్ ను గుర్తుకు తెచ్చాడు. ఇంజమామ్ కు ఇమామ్ మేనల్లుడు కావడం విశేషం. షార్ట్ కవర్స్ వైపు ఆడిన బంతిని అక్షర పటేల్ అందుకొని వికెట్లను గిరిటేశాడు. దీంతో ఇమాముల్ హక్ రనౌట్ గా వెనుదిరిగాడు. మామ వారసత్వాన్ని అల్లుడు కొనసాగిస్తున్నాడని సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అవుతున్నాయి. మామ లక్షణాలు అల్లుడు వచ్చినట్టు ఉన్నాయని పాక్ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News