రవి ప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీకర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘విద్రోహి’. ఈ చిత్రాన్ని విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం, పప్పుల కనకదుర్గారావు నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో వీఎస్‌వీ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా హీరో శ్రీకాంత్ విద్రోహి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘విద్రోహి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది.
నిర్మాత దుర్గారావు, దర్శకుడు వీఎస్‌వికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ సినిమాలో రవి ప్రకాష్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఆయన నాకు మంచి మిత్రుడు. టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్. ఈ సినిమా స్టోరీ నాకు తెలుసు. చాలా మంచి మూవీ అవుతుంది’ అని అన్నారు. ప్రొడ్యూసర్ పప్పుల కనకదుర్గారావు మాట్లాడుతూ.. ‘ఏప్రిల్‌లో మా సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం’ అని తెలియజేశారు. దర్శకుడు వీఎస్‌వి మాట్లాడుతూ.. ‘మా మూవీలో రవిప్రకాష్, శివ కుమార్ బాగా నటించారు. ప్రతి క్యారెక్టర్ ఆకట్టుకునేలా ఉంటుంది. ఇప్పటిదాకా రాని సరికొత్త పాయింట్ తో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా విద్రోహి సినిమాను రూపొందించాం’ అని తెలిపారు.