Tuesday, April 1, 2025

కుంభమేళకు వెళ్లి వస్తూ.. తిరిగిరాని లోకాలకు

- Advertisement -
- Advertisement -

మీర్జాపూర్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. అయితే ఈ ఉత్సవంలో పాల్గొనే క్రమంలో ఇప్పటికే చాలా మంది ప్రమాదాలకు గురై మృత్యువాత పడ్డారు. తాజాగా అలాంటి దుర్ఘటన చోటు చేసుకుంది.

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడిగి గ్రామానికి చెందిన వెంకట్‌రాం రెడ్డి తన భార్యతో సహా కుంభమేళకు వెళ్లి అక్కడ పవిత్ర స్నానాలు ఆచరించారు. అయితే అక్కడి నుంచి తిరిగి వస్తూ వీరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ప్రయాగ్‌రాజ్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీర్జాపూర్‌లో వీరు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొంది. వెంకట్‌రాం రెడ్డి జహీరాబాద్ డివిజన్ నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరి మృతితో మామిడిగి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News