- Advertisement -
అమరావతి: ఈ రోజు నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 10 గం.కు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు జరిగాయి. ఈ రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాల అజెండాను బిఎసిలో ఖరారు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 3 వారాల పాటు జరిపే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రేపు చర్చ జరగనుంది. శివరాత్రి, ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఈ నెల 26, 27న సెలవు ప్రకటించారు. ఈ నెల 28న శాసన సభలో 2025- 26 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. 2025 -26 బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. మార్చి 1,2 తేదీల్లో శని, ఆదివారం సందర్భంగా అసెంబ్లీకి సెలవు. మార్చి 3 నుంచి బడ్జెట్ సహా వివిధ అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగనుందని తెలిపారు.
- Advertisement -