- Advertisement -
అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సర్వం సిద్ధం అయ్యింది. ఈ సమావేశాల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సభ ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శించకూడదని, కరపత్రాలు పంపిణీ చేయడం వంటివి చేయకూదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. సభ పరిసరాల్లో సమావేశాలు, ప్రదర్శనలు, ధర్నాలు పూర్తిగా నిషేధించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఇతరులకు అనుమతి లేదని స్పష్టీకరించారు. సభ్యుల పిఎలకు ప్రాంగణంలోకి వచ్చేందుకు పాస్ లు రద్దు చేశారు. అసెంబ్లీతో సంబంధం లేని ఉద్యోగులు, సిబ్బందికి అనుమతి నిరాకరణనని తెలియజేశారు.
- Advertisement -