న్యాచురల్ స్టార్ నాని తన చేస్తున్న సినిమాల్లో ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా వేరియేషన్ చూపిస్తున్నారు. గత ఏడాది ‘సరిపోదా శనివారం’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న ఆయన త్వరలో ‘హిట్-3’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్‌లో చూపించిన భయంకరమైన వైలెన్స్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.
నానిని ఇలాంటి రోల్‌లో మునుపెన్నడు చూడలేదని ఆశ్చర్యపోతునున్నారు. ఇప్పటికే హిట్ ఫ్రాంచైజీ నుంచి రెండు సినిమాలు వచ్చాయి. తొలి సినిమాలో విశ్వక్‌సేన్ లీడ్ రోల్ చేయగా.. రెండో హిట్‌లో అడవి శేష్ హీరోగా నటించారు. ఇఫ్పుడు ఈ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో సినిమాలో నాని.. అర్జున్ సర్కార్ అనే రౌద్రమైన పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు.
ఈ టీజర్‌లో లాఠీతో ప్రత్యర్థులపై దాడి చేసే దృశ్యాలు, చివర్లో భయంకరంగా ఓ వ్యక్తి చంపే సీన్ అభిమానుల్ని షాక్‌కి గురి చేశాయి. ఇక ఈ సినిమాలో కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. శైలేష్ కోనేరు దర్శకత్వం వహిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యూననిమస్ ప్రోడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమాను ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.