- Advertisement -
అమరావతి: ప్రజాస్వామ్యం అంటే ఎపి ప్రభుత్వానికి చిన్న చూపని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రతిపక్షం అంటే ప్రజాపక్షమని గుర్తుంచుకోవాలని సూచించారు. ఆయన మీడియాతో మాట్లాడతూ… మిర్చి రైతులను ఆదుకోవాలని కోరామని తెలిపారు. రైతుల సమస్యలు ప్రస్తావించాలంటే… తమకు ప్రతిపక్షహోదా కావాలని కోరారు. రైతు సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. తాము ప్రజల సమస్యలపై అన్ని రకాలుగా పోరాడతామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
- Advertisement -