అమరావతి: తమ పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలంటే పోరాటం చేస్తున్న వైఎస్‌ఆర్‌సిపి పార్టీపై జనసేన అధినేత, రాష్ట ఉపముఖ్యమంత్రి మండిపడ్డారు. సోమవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు ఆయన తన పార్టీ ఎమ్మెల్యేతో హాజరు అయ్యారు. ఇక సభలో గవర్నర్ ప్రసంగం అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ ఉండగా వైసిపికి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు అని ఆయన ప్రశ్నించారు. టిడిపి తర్వాత అత్యధిక స్థానాలు తమ పార్టీకే వచ్చాయని.. తమ కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా.. వైసిపికి ప్రతిపక్ష హోదా దక్కేది అని ఆయన అన్నారు.
ఇక గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించడం సరైన పద్ధతి కాదు అని అన్న పవన్.. ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే.. జర్మనీకి వెళ్లాలని ఎందుకంటే అది అక్కడే సాధ్యమని పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా అనేది ఎవరో ఇచ్చేది కాదు అని దాని కొన్ని నియమ నిబంధనలు ఉంటాని ఆయన తెలిపారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకూ వైసిపికి ప్రతిపక్ష హోదా దక్కదని పవన్‌కళ్యాణ్ అన్నారు.