Monday, February 24, 2025

ప్రెస్‌మీట్‌లో కోహ్లీపై రిజ్వాన్ ఆసక్తికర కామెంట్స్

- Advertisement -
- Advertisement -

దుబాయ్: మైక్ ముందు కూర్చొని ప్రత్యర్థి జట్టు ఆటగాడిని పొగడటం అంత సులువైన పని కాదు. కానీ పాకిస్థాన్ కెప్టె మహమ్మద్ రిజ్వాన్ మాత్రం అది చేసి చూపించాడు. ఆదివారం పాకిస్థాన్‌పై వీరోచిత సెంచరీ సాధించి.. తమ జట్టును ఓటమి పాలు చేసిన విరాట్ కోహ్లీపై అతను ప్రశంసలు కురిపించాడు. ఈ మ్యాచ్‌ అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో అతను కోహ్లీ ఆటతీరును మెచ్చుకున్నాడు. సులభంగా ఛేజింగ్‌ చేసిన విధానమే కాకుండా.. 36 సంవత్సరాల వయస్సులో అతని ఫిట్‌నెస్ చూసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నాడు.

‘ముందు విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకుందాం. అతని హార్డ్‌వర్క్ చూసి నేను షాక్ అయ్యాను. ప్రపంచం అంతా అతను ఫామ్‌లో లేడు అని అనుకుంది, కానీ పెద్ద మ్యాచ్‌లకు వచ్చే సరికి అదరగొట్టాడు. విరాట్‌ని ఔట్ చేయాలని చాలా ప్రయత్నించాం. కానీ, మాకు అతను అవకాశం ఇవ్వలేదు. కాబట్టి నేను, కోహ్లీని ఒక క్రికెటర్‌గా కచ్చితంగా మెచ్చుకుంటాను’ అని అన్నాడు.

ఇక మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టు 241 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన భారత్‌కు విరాట్ అండగా నిలిచాడు. ప్రత్యర్థి బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ.. పరుగులు రాబట్టాడు. 111 బంతుల్లో ఏడు ఫోర్లతో 100(నాటౌట్) పరుగులు సాధించి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా అతను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును (51 సెంచరీలు) సమం చేశాడు. అంతేకాక.. అతి తక్కువ ఇన్నింగ్స్‌లో వన్డేల్లో 14000 పరుగుల మైలురాయిని చేరుకొని మరో రికార్డును సొంతం చేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News