Tuesday, February 25, 2025

ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా విజేందర్ గుప్తా ఎన్నిక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా విజేందర్ గుప్తా ఎన్నిక అనంతరం అధికార, ప్రతిపక్షాల నినాదాల నడుమ సభ సోమవారం 15 నిమిషాల సేపు వాయిదా పడింది. బిజెపిని ‘దళిత వ్యతిరేకి, సిక్కు వ్యతిరేకి’ అని ఆప్ సభ్యులు ఆరోపించారు. మూడు సార్లు బిజెపి ఎంఎల్‌ఎ విజేందర్ గుప్తా సోమవారం ఎనిమిదవ ఢిల్లీ శాసనసభ తొలి సెషన్‌లో స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక కోసం ముఖ్యమంత్రి రేఖా గుప్తా, క్యాబినెట్ మంత్రి రవీందర్ ఇంద్రాజ్ రెండు తీర్మానాలు ప్రవేశపెట్టారు.  మంత్రులు మన్‌జిందర్ సింగ్, పర్వేశ్ వర్మ తీర్మానాలను సమర్థించారు.

తీర్మానాలను సభ మూజువాణి వోటుతో ఆమోదించింది. ప్రోటెమ్ స్పీకర్ అర్విందర్ సింగ్ లవ్లీ నిర్వహించిన ఎన్నిక అనంతరం కొత్త స్పీకర్ విజేందర్ గుప్తాను ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకురాలు ఆయన ఆసనం వరకు తోడ్కొని వెళ్లారు. కొత్త స్పీకర్‌ను ముఖ్యమంత్రి రేఖా గుప్తా అభినందిస్తూ, ‘మీ అనుభవం, పరిజ్ఞానంసభలో విలువైనవిగా ఉంటాయి. మేము మాట్లాడేందుకు, మా అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు అవకాశం లభిస్తుంది. మీరు ఈ స్థాయికి చేరుకోవడానికి కష్టపడ్డారు. కానీ అటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో ఎదురుకావని, మీరు సభకు సమర్థంగా సారథ్యం వహిస్తారని ఆశిస్తున్నాను’ అని చెప్పారు.

ప్రతిపక్ష నాయకురాలు ఆతిశీ కొత్త స్పీకర్ విజేందర్ గుప్తాకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే, బిజెపి తీరు పట్ల నిరాశ వ్యక్తం చేశారు. ‘దళిత వ్యతిరేకి, సిక్కు వ్యతిరేకి అయిన పార్టీ ఢిల్లీ అసెంబ్లీకి సారథ్యం వహిస్తుండడం దురదృష్టకరం. బిజెపి తన దళిత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయంలో నుంచి బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్, షహీద్ భగత్ సింగ్ చిత్రపటాలను తొలగించింది’ అని ఆతిశీ ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News