- Advertisement -
రావల్పిండి: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఆరంభం నుంచి పరుగులు చేయడంలో తడబడ్డారు. కెప్టెన్ నజ్ముల్ శాంటో(77), జాకెర్ అలీ(45) మినహా మిగితా ప్లేయర్లు అందరూ స్వల్పస్కోర్‌కే పరిమితమయ్యారు. దీంతో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 236 పరుగులు చేసింది. కివీస్ బౌలింగ్‌లో బ్రేస్‌వెల్ 4, ఓరౌర్కే 2, హెర్నీ, జెమిసన్ తలో వికెట్ తీశారు.
- Advertisement -