Tuesday, February 25, 2025

బీహార్‌లో టెంపో, ట్రక్ ఢీకొని ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్‌లోని పాట్నా జిల్లాలో ఓ టెంపో ట్రక్‌ను ఢీకొనడంతో టెంపోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందారని పోలీసులు సోమవారం తెలిపారు. మసౌరి ప్రాంతంలోని నూరా వంతెన వద్ద ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు వారు వివరించారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బాధను వ్యక్తం చేశారు. ‘వారి కుటుంబాలకు హృదయపూర్వ సంతాపం తెలియజేసుకుంటున్నాను’ అని తెలిపినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది. ‘వాహనాలు ఢీకొన్న సమాచారం అందగానే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారని, ఆదివారం రాత్రి 9.30 గంటలకు ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు’ అని మసౌరి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. చనిపోయిన వారిని గుర్తిస్తున్నామని, ఇంత వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, దర్యాప్తు కొనసాగుతోందని కూడా ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News