- Advertisement -
మన తెలంగాణ / అమరావతి : ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు సోమవారం సభ నుంచి వాకౌట్ చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇచ్చే నిబంధన మన భారత రాజ్యాంగంలో లేదని అన్నారు. అలాగైతే జగన్ జర్మనీ వెళితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. జర్మనీలో ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం ఆధారంగా చట్టసభల సీట్లు కేటాయిస్తుంటారని, ఒకవేళ ఒక పార్టీకి 5 శాతం కంటే తక్కువ ఓట్లు వస్తే ఆ ఓట్లను ఇతరులు పంచుకుంటారని పవన్ వివరించారు. జగన్ ఇంకా ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు పడితే జర్మనీ వెళితే సరి అని పవన్ వ్యాఖ్యానించారు.
- Advertisement -