Tuesday, February 25, 2025

నేటి నుంచి ఎప్‌సెట్ దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

స్వీకరణకు
ఏప్రిల్ 4 వరకు అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టిజి ఎప్‌సెట్(ఇఎపిసెట్) ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మంగళవారం (ఫిబ్రవరి 25) నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 4 వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చు. రూ.250 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 9 వరకు, రూ.500 ఆలస్యం రుసుంతో ఏప్రిల్ 14 వరకు, రూ.2500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 18 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఒక పేపర్‌కు హాజరయ్యే విద్యార్థులు రూ.900 ఫీజు ఉండగా, ఎస్‌సి ఎస్‌టి వికలాంగులకు రూ.500, రెండు పేపర్లకు హాజరయ్యే విద్యార్థులు రూ.వెయ్యి, ఎస్‌సి ఎస్‌టి వికలాంగులకు రూ.1800 చెల్లించాలి. ఏప్రిల్ ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు, మే 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News