Tuesday, February 25, 2025

కనికరంలేని అర్జున్ సర్కార్

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్ : ది థర్డ్ కేస్’. విజనరీ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సిరీస్‌లో మూడవ భాగంగా రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్‌లకు అద్భుతమైన స్పందనతో భారీ అంచనాలను నెలకొల్పింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. సోమవారం నాని పుట్టినరోజు సందర్భంగా సర్కార్స్ లాఠీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పోలీసులను కలవరపెడుతూ వరుస రహస్య హత్యల నేపధ్యంలో టీజర్ మొదలవుతుంది.

వారు ఎంత ప్రయత్నించినా హంతకుడిని పట్టుకోవడంలో విఫలమవుతారు. చివరి ప్రయత్నంగా టెర్రిఫిక్, బ్రూటల్ ఇన్వెస్టిగేటర్ అర్జున్ సర్కార్‌ని ఆశ్రయిస్తారు. నాని అర్జున్ సర్కార్‌గా పవర్‌ఫుల్ నటనతో కట్టిపడేశారు. కనికరంలేని పాత్రలో అదరగొట్టారు. ముఖ్యంగా ఓ సన్నివేశంలో అతను నేరస్థుడిని పొడిచి కత్తిని పైకి లాగడం, రూఫ్‌పై రక్తం చిమ్మడం – అతని పాత్ర క్రూరత్వాన్ని హైలెట్ చేస్తోంది. దర్శకుడు శైలేష్ కొలను హిట్ సిరీస్‌ను అద్భుతమైన కథనం, గ్రేట్ విజువల్స్‌తో నెక్స్ లెవెల్‌కి తీసుకెళ్ళాడు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ‘హిట్ 3’ మే 1న థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News