Tuesday, February 25, 2025

పాక్ బౌలర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వసీం అక్రమ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ పై భారత్ విజయం సాధించింది. విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ చేయడంతో టీమిండియా గెలుపొందింది. భారత ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఔటై వెళ్తుండగా పాక్ బౌలర్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ అతడిని సాగనంపుతున్నట్టు సైగ చేయడాన్ని పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అతడిపై విమర్శలు గుప్పించాడు. అద్భుతమైన బంతికి గిల్ ఔట్ కావడంతో అబ్రార్ సంబరాలు చేసుకున్నాడు. కానీ దేనికైనా సమయం సందర్భం కావాలని చురకలంటించారు.

జట్టు గెలుస్తున్నప్పుడు సంబరాలు చేసుకుంటే పర్వాలేదు కానీ ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు వికెట్ తీసి వినయంగా ఉండాలని సూచించారు. అబ్రార్ హేళన చేస్తున్నప్పుడు అతడికి చెప్పడానికి ఎవరు లేరని, ఆ సంబరం అన్నింటినీ కిల్ చేసిందని దుయ్యబట్టారు. ఐదు పరుగులకు ఏడు వికెట్లు తీసినప్పుడు తాను అర్ధం చేసుకోగలను కానీ అబ్రార్ వ్యవహరించి తీరు సరిగా లేదని, టివిలో చూస్తున్నప్పుడు అలాగే కనిపించిందని వసీం అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News