పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ హైలీ ఎంటర్‌టైనింగ్ మూవీ శివరాత్రి కానుకగా బుధవారం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ దండా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “మజాకా మంచి ఎంటర్‌టైనర్.
ఫ్యామిలీ సినిమా. డైరెక్టర్ త్రినాధ్ రావు, రైటర్ ప్రసన్న స్టయిల్‌లో వుండే మాస్ ఎంటర్‌టైనర్. -మజాకా ఖచ్చితంగా చాలా మంచి సినిమా అవుతుంది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ ఎమోషన్ వున్న సినిమా. ఇంటర్వెల్‌కి మంచి ట్విస్ట్ వుంటుంది. అది సెకండ్ హాఫ్‌ని ఎలా లీడ్ చేస్తోందో చాలా ఆసక్తికరంగా వుంటుంది. సందీప్ కిషన్, రావు రమేష్ సీన్స్, సందీప్, రీతు లవ్ స్టొరీ, అలాగే రావు రమేష్, అన్షు ట్రాక్ కూడా చాలా బావుంటుంది. సందీప్‌కి భైరవ కోన సినిమా కంటే మంచి సినిమా ఇదవుతుంది. డైరెక్టర్ తండ్రి పాత్రకు ముందు నుంచి రావు రమేష్‌ని అనుకున్నారు. ఆయన నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో కామెడీ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది.
-మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న టైటిల్ పెట్టాలని అనుకున్నాం. ఒక సెలబ్రేషన్ వైబ్ వున్న సినిమా ఇది. మజాకా టైటిల్ పర్ఫెక్ట్ అనిపించింది. త్రినాథ్ రావు నక్కినతో వర్క్ చేయడం అద్భుతమైన అనుభవాన్నిచ్చింది. సినిమాని అద్భుతంగా తీశారు. ఆయనతో మరో సినిమా చేయాలని వుంది. ఇదే సినిమాకి సీక్వెల్ చేయాలని ఆలోచన వుంది. సినిమా చివరలో డబుల్ మజాకా అనే టైటిల్ కూడా వేశాం. ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి మెసేజ్ కూడా వుంది. ఇద్దరు బ్యాచిలర్స్ వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవాలని తపన పడతారు. అది సినిమాలో బ్యూటీఫుల్ ఎమోషన్. -నిర్మాత అనిల్‌తో వచ్చే ఏడాది ఓ పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఈ సంవత్సరంలోనే ఆ సినిమా ప్రకటన ఉంటుంది. -ఇక నెక్స్ సంయుక్తతో ఓ ప్రాజెక్ట్ జరుగుతోంది. అలాగే కిరణ్ అబ్బవరంతో సినిమా షూటింగ్ జరుగుతోంది”అని అన్నారు.