అమరావతి: విసిలతో బలవంతంగా రాజీనామా చేయించారని ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ బొత్స నారాయణ తెలిపారు. గవర్నర్ ప్రసంగంపై చర్చలో వాదోపవాదనలు జరిగిన చర్చలో మంత్రి నారా లోకేష్ పై బొత్స తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విసిలతో బలవంతంగా రాజీనామా చేయించడంపై విచారణ జరిపిస్తే… తాము నిజానిజాలు నిరూపిస్తామని బొత్స అన్నారు. విచారణకు లోకేష్ సిద్ధమా? ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
మంత్రులు అడ్డు తగలడంపై బొత్స అభ్యంతరం చెప్పారు. మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇచ్చేశామని గవన్నర్ ప్రసంగంలో ఎలా చెప్తారని బొత్స ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం టిడిపి, జనసేనపై ఆధారపడి ఉన్నా…ప్రత్యేక హోదా సాధించలేక పోయారని విమర్శించారు. వరుదు కల్యాణి మాట్లాడుతుండగా మళ్లీ లోకేష్ అడ్డు తగిలాడని చెప్పారు. తదుపరి మేం కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇచ్చామని, మా మీద కేంద్రం ఆధారపడిందని ఏనాడు చెప్పలేదని లోకేష్ అంటున్నారని, బొత్స పేర్కొన్నారు.