Tuesday, February 25, 2025

త్వరలో రష్యాఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ సాధ్యమే : మేక్రాన్

- Advertisement -
- Advertisement -

పారిస్ : రష్యాఉక్రెయిన్ మధ్య పోరు ముగింపు దశకు చేరిందన్న సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి. తాజాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సమావేశం ముగిసిన తరువాత ఫ్రాన్స్ అధినేత ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ‘ఫాక్స్‌న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని వారాల్లో రష్యాఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ సాధ్యమేనని పేర్కొన్నారు. అయితే దీనికోసం మాస్కో నుంచి బలమైన సెక్యూరిటీ గ్యారెంటీలు అవసరమని వెల్లడించారు. దీంతోపాటు చర్చల సమయంలో క్రెమ్లిన్‌తో ట్రంప్‌తో సహా మిగిలిన నేతలు మొత్తం అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. “ 2014 నుంచి మనకు రష్యాతో ఓ కాల్పుల విరమణ ఒప్పందం ఉంది. దానిని ప్రతిసారీ ఉల్లంఘించారు.

ఏ శాంతి ఒప్పందంలోనైనా ఉక్రెయిన్ పూర్తిగా లొంగిపోకూడదు. పుతిన్‌తో ఏ ఒప్పందానికైనా వెనుక సెక్యూరిటీ గ్యారంటీలు అవసరం. మరో 30 మంది ఐరోపా నేతల మిత్రులతో చర్చలు జరిపినప్పుడు వారు కూడా ఉక్రెయిన్‌కు సెక్యూరిటీ గ్యారెంటీ విషయంలో సానుకూలంగా ఉన్నారు. బ్రిటన్ ప్రధాని స్టార్మర్‌తో కలిసి ఆ ప్రాంతం లోకి దళాలను పంపడంపై పనిచేస్తున్నాం. అవి సరిహద్దుల్లోకి వెళ్లవు. యుద్ధంలో పాల్గొనవు. కానీ ఒప్పందం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో మాత్రం శాంతిని కొనసాగించడానికి అవి ఉంటాయి” అని మేక్రాన్ పేర్కొన్నారు. యుద్ధాన్ని వీలైనంత వేగంగా ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫ్రాన్స్ అధినేత మేక్రాన్ చర్చలు జరిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News