Tuesday, February 25, 2025

కొంపముంచిన వాన.. ఆసీస్, సఫారీ మ్యాచ్ రద్దు

- Advertisement -
- Advertisement -

రావల్పిండి: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రావల్పిండి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరిగాల్సిన మ్యాచ్ టాస్ పడకుండా వర్షం కారణంగా రద్దైంది. సోమవారం టాస్ పడే సమయానికి వర్షం కాస్త తెరిపి ఇచ్చిన.. ఆ తర్వాత వెంటనే కురవడం మొదలైంది. అయితే వర్షం తగ్గగానే మ్యాచ్‌ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉన్నారు. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో కనీసం 20 ఓవర్ల మ్యాచ్ అయినా.. నిర్వహిస్తారని అంతా అనుకున్నారు. కానీ, వర్షం మాత్రం ఏ మాత్రం తగ్గు ముఖం పట్టలేదు. దీంతో మ్యాచ్‌ని రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్‌ను ఇచ్చారు. దీంతో ఇప్పటికే గ్రూప్‌-బిలో చెరో మ్యాచ్‌ గెలిచిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు ఖాతాలో మూడు, మూడు పాయింట్లు చేరాయి.

దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో అస్ట్రేలియా ఆడిన చివరి ఎనిమిది మ్యాచుల్లో నాలుగు రద్దు కావడం.. లేదా ఫలితం రాకుండా ఉండిపోవడం విశేషం. అయితే గ్రూప్-బిలో పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్‌కు బుధవారం జరిగే మ్యాచ్ కీలకమైంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు ఆ తర్వాత మ్యాచ్‌ గెలిచినా లాభం ఉండదు. ఆ జట్టు భవిష్యత్తు ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడి ఉంటు్ంది. మరోవైపు నెట్‌రన్‌ రేటుతో ప్రథమ స్థానంలో ఉన్న సౌతాఫ్రికా మాత్రం తర్వాతి మ్యాచ్‌లో నెగ్గితే.. నేరుగా సెమీఫైనల్‌‌కు వెళ్లనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News