Wednesday, February 26, 2025

అధికార కూటమికి ఘోర ఓటమి

- Advertisement -
- Advertisement -

జర్మనీ పార్లమెంట్ లోని దిగువ సభ ‘బుందెస్టాగ్’ లో మొత్తం 630 స్థానాలు ఉండగా, వాటిలో 208 సీట్లను ఫ్రెడ్రిక్ మెర్జ్ సారథ్యం లోని కన్జర్వేటివ్ పార్టీల కూటమి కైవసం చేసుకుంది. అలైస్ వీడెల్ సారథ్యం లోని ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (ఏఎఫ్‌డీ) పార్టీకి 152 సీట్లు వచ్చాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం లోని మూడు పార్టీలు కూడా పెద్ద సంఖ్యలో సిట్టింగ్ స్థానాలను కోల్పోయాయి. ఛాన్సలర్ ఓలఫ్ షోల్జ్‌కు చెందిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ (ఎస్‌డీపీ) 120 సీట్లతో మూడోస్థానానికి పరిమితమైంది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఎన్నడూ లేనంతగా ఘోర ఓటమిని చవి చూసింది. గ్రీన్స్ పార్టీ 85 స్థానాలతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. వామపక్ష ది లెఫ్ట్ పార్టీ 64 సీట్లు సాధించింది. వామపక్ష భావజాలం కలిగిన సహ్రా వాంగెన్ నెచ్ కూటమికి ఒక్క సీటు కూడా రాలేదు. ఇతరులకు ఒక్కస్థానం దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News