Wednesday, February 26, 2025

మిమో చక్రవర్తి యాక్షన్ సీన్స్ ఇరగదీశారు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ బాలీవుడ్ నటుడు, సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి, ఎయిర్ టెల్ ఫేం సాషా చెత్రి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘నేనెక్కడున్నా’. కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాతో మాధవ్ కోదాడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఈనెల 28న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు గంగాధర్, గోపీనాధ్ రెడ్డితో పాటు టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. వీవీ వినాయక్, బ్రహ్మజీ, ప్రేమ్ రక్షిత్ వీడియో బైట్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలో హీరో మిమో చక్రవర్తి మాట్లాడుతూ “సినిమా ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. ఈ సినిమాకు మెయిన్ హీరో మాధవ్. మా నాన్నగారిలా నేను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో భాగమవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈనెల 28న వస్తున్న ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. చిత్ర దర్శకుడు మాధవ్ కోదాడ మాట్లాడుతూ “మిమోకు త్వైకాండోలో బ్లాక్ బెల్ట్ ఉంది. యాక్షన్ సీన్స్ ఇరగదీశారు. సాషా కూడా బాగా చేశారు. తనికెళ్ళ భరణి చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌తో కంటతడి పెట్టించారు. మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ తన నేపథ్య సంగీతంతో సినిమాను నెక్స్ లెవల్ కు తీసుకు వెళ్లారు” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైటర్,- డైరెక్టర్ బీవీఎస్ రవి, హీరోయిన్ సాషా చెత్రి. చందు, మిహీరా, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News