ఈ జనరేషన్ దర్శకులలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం కాస్త భిన్నంగా ఉంటుంది. తీసింది రెండు సినిమాలే అయినా.. సందీప్ యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. కాగా.. సందీప్ దర్శకత్వంలో రణ్‌వీర్ కపూర్ హీరోగా 2023లో వచ్చిన సినిమా యానిమల్. ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదురుకుంది. విపరీతమైన హింసాత్మక దృశ్యాలు ఉండటం.. మహిళలను తక్కువ చేసిన దృశ్యాలు ఉండటం వంటివి కొందరు తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. అయితే ఈ సినిమా సీక్వెల్‌పై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు.
‘యానిమల్ పార్క్’ అనే టైటిల్‌తో ఈ సినిమా రాబోతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే యానిమల్‌ని మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కిస్తానని సందీప్ అన్నారు. స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే ఈ విషయాన్ని అనుకున్నానని ఆయన పేర్కొన్నారు. ఇక యానిమల్ పార్క్ సినిమాలో రణ్‌వీర్ హీరోగా, విలన్‌గా డ్యూయోల్ రోల్‌లో కనిపించి అలరించనున్నట్లు తెలిపారు. అయితే యానిమల్ సినిమాపై వచ్చిన విమర్శలపై కూడా వంగా కామెంట్ చేశారు. సినిమా గురించి అంతా దర్శకుడినే విమర్శించారని.. హీరోను ఎవరూ ఏమీ అనలేదని ఆయన అన్నారు. తాను పరిశ్రమకి కొత్త కాబట్టి తనని విమర్శించడం చాలా సులభమని ఆయన పేర్కొన్నారు.