- Advertisement -
హైదరాబాద్: నియోజక వర్గాల పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమర్థించి, మద్దతు ఇచ్చారు. కుటుంబ నియంత్రణ అమలు చేసిన రాష్ట్రాలను శిక్షించడం తగదని కెటిఆర్ పేర్కొన్నారు. దక్షిణాది పనితీరును పట్టించుకోకపోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్దమని అన్నారు. దేశ నిర్మాణంలో దక్షిణాది రాష్ట్రాల పాత్రను ఎవరూ విస్మరించలేరని తెలిపారు. దేశంలో తెలంగాణ జనాభా 2.8 శాతం… ఉంటే జిడిపి 5.2 శాతం…అని కెటిఆర్ స్పష్టం చేశారు.
- Advertisement -