ప్రయాగ్‌రాజ్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళ బుధవారంతో ముగియనుంది. ఇఫ్పటిక 60 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారని.. ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్ వెల్లడించింది. అయితే సామాన్య భక్తులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ కుంభమేళలో పాల్గొన్నారు. అయితే స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌కు మాత్రం కుంభమేళలో చేదు అనుభవం ఎదురైంది.
కొద్దిరోజుల క్రితం కత్రినా మహా కుంభమేళకు వెళ్లి అక్కడ పవిత్ర స్నానం చేశారు. ఆమె తన అత్తగారు, కొందరు పూజారులు, బాడీగార్డ్స్‌తో కలిసి పవిత్రస్నానం చేస్తుండగా.. జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఆమెతో కలిసి ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఓ డ్రోన్ తీసిన వీడియోలో ఈ దృశ్యాలు కనిపించాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలకు కావాల్సిన ప్రశాంతత కూడా ఇవ్వకుండా ఇలా చేయడాన్ని తప్పుబడుతున్నారు. ‘నేను అందుకే విఐపి కల్చర్‌ని సమర్ధిస్తాను. సాధారణ ప్రజల మధ్యలోకి వస్తే.. ఇలాంటివే జరుగుతాయి’ అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.