Thursday, February 27, 2025

కుంభమేళకు రాని ఆ ఇద్దరిని నిషేధించాలి: కేంద్రమంత్రి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్ వేదికగా జరుగుతున్న మహాకుంభమేళ ముగింపు దశకు చేరుకుంది. బుధవారం, మహా శివరాత్రితో ఈ ఉత్సవం ముగుస్తుండటంతో పెద్ద ఎత్తున భక్తులు పవిత్రస్నానాలు చేసేందుకు తరలివస్తున్నారు. ఇప్పటికే 60 కోట్లకు పైగా భక్తులు కుంభమేళాలో స్నానాలు చేశారు. ప్రధాని, రాష్ట్రపతితో సహా ఎందరో ప్రముఖులు ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో పాలు పంచుకున్నారు.

అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, శివసేన(యుబిటి) అధినేత ఉద్ధవ్ ఠాక్రేలపై కేంద్ర మంత్రి రాందాస్ ఆఠవలే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రకు చెందిన ఓ దళిత నేత అయిన ఆఠవలే తరచూ హిందుత్వం గురించి మాట్లాడే ఠాక్రే కుంభమేళకు ఎందుకు రాలేదని కనీసం మండిపడ్డారు. కుంభమేళకు రాకుండా గాంధీ, ఠాక్రేల కుటుంబాలు హిందూ సమాజాన్ని అవమానపరిచారని పేర్కొన్నారు. కాబట్టి హిందూ ఓటర్లు వాళ్లని బహిష్కరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పినట్లే.. ఠాక్రేకి కూడా గుణపాఠం నేర్పించాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News