Thursday, February 27, 2025

36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తెచ్చింది లేదు:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తెచ్చింది లేదని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఎస్‌ఎల్‌బిసి సొరంగం కూలి ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారంలో మునిగి తేలారని, మూడు నెలలుగా జీతాల్లేక అల్లాడుతున్నామని కార్మికులు వాపోతుంటే ఎన్నికల ప్రచారం ముగించుకుని నిమ్మలంగా మళ్లీ హస్తిన బాటపట్టారని ఎక్స్ వేదికగా విమర్శించారు. సొరంగంలో సహాయక చర్యలు ఒక్కడుగు ముందుకు .. వందడుగులు వెనక్కి అన్నట్లుగా ఉందని పేర్కొన్నారు. అక్కడ ఆక్సిజన్ లేదు…

కన్వేయర్ బెల్టు తెగిపోయింది..96 గంటలు దాటినా ఒక్కడుగూ ముందుకు పడడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం పర్రెల మీద శ్రీశైలం అగ్నిప్రమాదం మీద కారుకూతలు కూసి, విషపు రాతలు రాసిన మేధావుల నోళ్లు ఎస్‌ఎల్‌బిసి విషయంలో మాత్రం నోరెత్తడం లేదని మండిపడ్డారు. హస్తిన యాత్రలు మాని ఆ కార్మికుల గోడు వినాలని, ఆ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు. అక్కడ చిక్కుకున్నవి సాధారణ ప్రాణాలు కాదు .. ఈ జాతి సంపద అంటూ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News