కన్నడ డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటించిన తాజా చిత్రం రాక్షస. లోహిత్ హెచ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టైమ్ లూప్ హారర్ కాన్సెప్ట్ తో రూపొందించారు. మార్చి 7న ఈ చిత్రం విడుదల కానుంది. ఫిబ్రవరి 28న విడుదల కావలసిన ఈ చిత్రాన్ని కొన్ని అనివార్య కారణాలతో వారం రోజులపాటు వాయిదా వేశారు. ఫైనల్‌గా మార్చి 7న ఒరిజినల్ వర్షన్ కన్నడతో పాటు తెలుగులోనూ వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు రానుంది. గతంలో శివరాజ్ కుమార్ నటించిన వేద చిత్రాన్ని విడుదల చేసిన ఎంవీఆర్ కృష్ణ రాక్షస ట్రైలర్ నచ్చి తెలుగు రైట్స్ ను దక్కించుకున్నారు. కంచి కామాక్షి కోల్ కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఎంవిఆర్ కృష్ణ మాట్లాడుతూ..“మంచి ఔట్ పుట్ కోసం మా చిత్రాన్ని వారం రోజులు పాటు వాయిదా వేశాం. మార్చి 7న విడుదలకు అన్ని సన్నాహాలు చేస్తున్నాం”అని చెప్పారు.