ఉ. 8 గంటల నుంచి సా.4 గంటల
వరకు ఓటింగ్ మార్చి 3న లెక్కింపు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఒక గ్రా డ్యుయేట్,రెండు ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానాల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం(ఫిబ్రవరి 27) ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎంఎల్‌సి బరిలో 57 మంది అభ్యర్థులు ఉండగా, ఈ ఎన్నిక కోసం 499 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ -కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి 15 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, 274 పోలింగ్ కేం ద్రాలు, వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో 3,55,159 మంది ఓటర్లు ఉండగా,
కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 27,088 మంది ఓటర్లు, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 25,759 మంది ఓట ర్లు ఉన్నారు. పోలింగ్ స్టేషన్‌ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పా టు చేశారు. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎంఎల్‌సి ఎన్నికలో ప్రాధాన్య పద్ధతిలో ఓటు వేయాల్సి ఉంటుంది. ఓటర్లు అభ్యర్థులకు ప్రాధాన్య ఓటు ద్వారా తమ మద్దతు తెలియజేయవచ్చు. పోటీ చే స్తున్న వారిలో కేవలం ఒక్కరికి లేదా ఒకరి కంటే ఎ క్కువ మందికి లేదా పోటీలో ఉన్న వారందరికీ ఓటు వేయవచ్చు. అయితే అందరికీ ఒకేలా కాకుండా.. ప్రాధాన్య క్ర మంలో అంకెల రూపంలోనే ఓటు వేయాలి. ఈ బ్యా లెట్ పత్రంపై నోటా గుర్తు కాలమ్ ఉండదు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డు లేదా భారత ఎన్నికల సంఘం ధ్రువీకరించిన ఇతర పత్రాలను చూపడం ద్వారా ఓటు వేయొచ్చు.
ఓట్లు ఇలా వేయాలి
—-ప్రాధాన్యాలను 1, 2, 3.. ఇలా అంకెలలో మాత్రమే వేయాలి
–ఒక అభ్యర్థికి ఒక ప్రాధాన్యమే ఇవ్వాలి –బ్యాలెట్‌లో ఉన్నవారిలో
ఒక్కరికి మాత్రమే తొలి ప్రాధాన్యం(1) ఇవ్వాలి –బ్యాలెట్‌లో ఉన్న
వారికి ఒకరి కంటే ఎక్కువ మందికి కూడా ప్రాధాన్య ఓటు
వేయవచ్చు –బ్యాలెట్‌లో ఉన్నవారందరికీ ప్రాధాన్యమిస్తూ వారి
పేర్ల పక్కన సంఖ్య రూపంలో ఓటు వేయవచ్చు –అభ్యర్థి పేరు,
ఫొటో పక్కన గడి లోపలనే లేదా బార్డర్‌లు దాటకుండా సంఖ్య
వేయాలి –1, 2, 3… లేదా రోమన్ అంకెలలోనూ ఓటు ప్రాధాన్యం
తెలియజేయవచ్చు –పోలింగ్ అధికారి ఇచ్చిన పెన్ను/స్కెచ్
ద్వారానే అంకెలు వేయాలి.
ఇలా వేస్తే చెల్లవు
-బ్యాలెట్ పత్రంపై వేలిముద్ర, సంతకం,
పేర్లు, ఇతర రాతలు -రైట్ గుర్తు, తప్పు
గుర్తు వంటి గుర్తులు వేయడం -మొదటి ప్రాధాన్యం ఇవ్వకుండా, 2, 3 ప్రాధాన్యాలు
ఇవ్వడం. మధ్యలో అంకెలు వదలడం.
-ప్రాధాన్యాలను అక్షరాల్లో రాయడం,
కొన్నింటిని అంకెలలో, మరికొన్నింటిని
అక్షరాల్లో రాయడం -ఒకే అభ్యర్థికి ఒకటి
కంటే ఎక్కువ ప్రాధాన్యాలు ఇవ్వడం
-సొంత పెన్ను పెన్సిల్‌తో అంకెలు వేయడం.