ఇంగ్లండ్ ఇంటికి
లాహోర్: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లండ్ నిష్క్రమించింది. బుధవా రం అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ 8 పరుగుల తేడా తో పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో ఇంగ్లండ్ సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి. అఫ్గాన్ సెమీస్ అవకాశాలను నిలబెట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఓపెనర్‌ఇబ్రాహీం జద్రాన్ రికార్డు సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.
విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన జద్రాన్ 146 బంతుల్లోనే 12 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 177 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఛాంపియ న్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా నయా రి కార్డు నెలకొల్పాడు. తర్వాత లక్షఛేదనకు దిగిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైంది. స్టార్ ఆటగాడు జో రూట్ అద్భుత సెంచరీ సాధించినా ఫలితంలేకుండా పోయింది. ఒంటరి పోరాటం చేసి న రూట్ 111 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌తో 120 పరుగులు చేశా డు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఓమర్ జాయ్ 5 వికెట్లు పడగొట్టాడు.