హైదరాబాద్: టిఎస్‌ఆర్‌టిసి బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు కండక్టర్ వద్ద తగినంత చిల్లర లేనప్పుడు టికెట్ వెనక వైపున ఇవాల్సిన డబ్బులు ప్రయాణికుడికి రాసిస్తాడు. ప్రయాణికుడికి గుర్తు ఉంటే తన గమ్యం స్థానం చేరేలోపు కండక్టర్ ను అడిగి డబ్బులు తీసుకుంటాడు. కానీ కొన్నిసార్లు బస్సు దిగే సమయంలో ప్రయాణికుడు డబ్బులు మరిచిపోతాడు. ఆ డబ్బులను ఎవరిని అడగాలో తెలియదు. టిఎస్‌ఆర్‌టిసి వినూత్నంగా ఓ హెల్ప్‌లైన్ నంబర్‌ను తీసుకొచ్చింది. హెల్ప్‌లైన్ నంబర్‌కు 04069440000 పోన్ చేసి సమాచారం ఇస్తే ఫోన్ పే, గూగుల్ పే ద్వారా మన డబ్బుల్ని తిరిగి ఇచ్చేస్తారు. దూర ప్రయాణం చేసేటప్పుడు ఎక్కిన బస్సు మిస్ అయితే ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే మరో బస్సులో సిబ్బంది సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చుతారు. కొందరు కండక్టర్లు వద్ద చిల్లర ఉన్న కూడా ఛేంజ్ ఇవ్వడం లేదని ప్రయాణికులు ఆరోఫణలు చేస్తున్నారు. చిల్లర లేదని బస్సు ఎక్కిన ప్రతి ప్రయాణికుడికి కొందరు కండక్టర్లు టికెట్ వెనుక వైపున డబ్బులు రాసి ఇస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టిఎస్ ఆర్ టిసి సంస్థ కండక్టర్ల వద్ద తక్కువలో తక్కువ రెండు వేల చిల్లర ఉండేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. బస్సులో ఫోన్ పే, గూగుల్ పే సదుపాయాలు కల్పించాలని ప్రయాణికులు, కండక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. బస్సులో ప్రయాణం చేసిన పురుషులకు మహాలక్ష్మీ పథకం టికెట్లు(జీరో టికెట్లు) ఇచ్చి కొందరు కండక్టర్లు తమ జేబులు నింపుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
కండక్టర్ దగ్గర డబ్బులు మర్చిపోయారా… ఎలా తీసుకోవాలో తెలుసా?
- Advertisement -
- Advertisement -
- Advertisement -