మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ఒక గ్రాడ్యయేట్, రెండు ఉపాధ్యాయ ఎంఎల్ సి స్థానాల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగుతోంది. మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎంఎల్‌సి బరిలో 57 మంది అభ్యర్థులు ఉండగా, ఈ ఎన్నిక కోసం 499 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ -కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి 15 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, 274 పోలింగ్ కేంద్రాలు, వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో 3,55,159 మంది ఓటర్లు ఉండగా, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 27,088 మంది ఓటర్లు, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 25,759 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ స్టేషన్‌ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు.
మూడు ఎంఎల్ సి ఎన్నికల పోలింగ్ ప్రారంభం
- Advertisement -
- Advertisement -
- Advertisement -