Thursday, February 27, 2025

భార్యను చంపిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్… ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: అనుమానం పెనుభూతంగా మారడంతో భార్యను ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్య చేసి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సురేష్ అనే యువకుడు హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. శ్రావణి అనే అమ్మాయిని సురేష్ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. భార్య అనుమానం రావడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సురేష్ మకాం రేవేంద్రపాడుకు మార్చాడు. బుధవారం భార్య శ్రావణి చంపి అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News