అమరావతి: అందరికీ తోడుగా ఉంటామని మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. నటుడు పోసాని కృష్ణా మురళీ అరెస్ట్‌ను జగన్ ఖండించారు. సినీ హాస్యనటుడు పోసాని కృష్ణ మురళి సతీమణి కుసుమ లతను ఫోన్ లో ఆయన పరామర్శించారు. వైెెఎస్ ఆర్ సిపి అండగా ఉంటుందని కుసుమలతకు ధైర్యం చెప్పారు. దేవుడు అంతా చూస్తున్నారు.. పోసాని కుటుంబం ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో నిరంకుశ పాలన ఎక్కువ కాలం కొనసాగదని మండిపడ్డారు. పొన్నవోలు సహా అందరినీ రాజం పేటకు పంపిస్తున్నామని, నాయకులందరినీ కోర్టు వద్దకు పంపించామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
సినిమా నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా పోలీసులు హైదరాబాద్‌లో ఆయన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్, చంద్రబాబును టార్గెట్ చేస్తూ పోసాని విమర్శలు చేశారు. దీంతో ఆయన అనేక కేసుల్లో చిక్కుకున్నారు. వాళ్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని మాట్లాడటంతోపాటు వారిపై బూతుల వర్షం కురిపించాడు. అన్నమయ్య జిల్లాలోని ఓబులవారి పల్లెలో నమోదు అయిన కేసు ఆధారంగా పోలీసులు పోసానిని అరెస్టు చేశారు.