- Advertisement -
హైదరాబాద్: దేశంలోనే తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మాదాపూర్‌లో హెచ్‌సిఎల్ టెక్ నూతన క్యాంపస్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగించారు. నూతన హెచ్‌సిఎల్ క్యాంపస్ ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. హైదరాబాద్ దేశంలోనే అత్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా మారిందని కొనియాడారు. తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరని, 2025వ సంవత్సరంలోనే దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు సాధించామని, తెలంగాణ వన ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఇవి, బయోటెక్ సహా తదితర రంగాల్లో హైదరాబాద్ అగ్రగామిగా ఉందని ప్రశంసించారు.
- Advertisement -