Friday, February 28, 2025

మోడీ విజన్‌తో విశ్వవేడుకగా మహాకుంభమేళా: యోగి ఆదిత్యనాథ్

- Advertisement -
- Advertisement -

ప్రయాగ్‌రాజ్ : మహాకుంభ్‌మేళాను విజయవంతంగా నిర్వహించడమే కాక, ప్రపంచ స్థాయి వేడుకగా చేయడం మోడీ విజన్ వల్లనే సాధ్యమైందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం ప్రశంసించారు. మహాకుంభ్ మేళా విషయంలో మోడీకే మొత్తం గొప్పతనాన్ని కట్టబెట్టారు. మహాకుంభమేళా ముగిసిన సందర్భంగా పాత్రికేయులను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసినందుకు మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. విశ్వాసాన్ని, ఆర్థికవ్యవస్థను సమ్మిళితం చేసే మోడీ సంకల్పాన్ని కొనియాడుతూ ఆధ్యాత్మిక పర్యాటకానికి కావలసిన అపారసామర్థం ఉత్తరప్రదేశ్‌కు ఉందని పేర్కొన్నారు.

అయోధ్య, వారణాసి, మధుర, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, వింధ్యాచల్, గోరఖ్‌పూర్, నైమిశారణ్య, తదితర ప్రముఖ పర్యాటక ప్రదేశాలతోసహా ఉత్తరప్రదేశ్ లోని వివిధ మతపరమైన క్షేత్రాలను 2024లో 64 కోట్ల మంది యాత్రికులు, పర్యాటకులు సందర్శించారని చెప్పారు. ప్రయాగ్‌రాజ్ లోని మహాకుంభమేళాకు గత 45 రోజుల్లో 66.3 కోట్ల మంది యాత్రికులు , పర్యాటకులు వచ్చారని, ఆధ్యాత్మిక పర్యాటకంలో కొత్త రికార్డులు సృష్టించారని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News