Friday, February 28, 2025

‘కూలీ’లో పూజా హెగ్డే

- Advertisement -
- Advertisement -

రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’. నాగార్జున , శ్రుతిహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రధారులు. ఈ సినిమాలో పూజా హెగ్డే నటించనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో పూజా హీరోయిన్‌గా ఖరారయ్యారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా తెలిపింది. దీనికి సంబంధించి ఓ ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేసి ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టాలంటూ పోస్ట్ పెట్టింది. తాజాగా ఆ ప్రీ లుక్‌ని పోస్టర్ పూజా హెగ్డేదేనంటూ ఖరారు చేశారు.

ఇందులో పూజా కీలక పాత్రలో నటించనున్నారా, ప్రత్యేక గీతంలో కనిపించనున్నారా అనేది తెలియాల్సి ఉంది. అనిరుధ్ ఈ సినిమాకు ‘జైలర్’లోని ‘కావాలయ్యా’ పాట తరహాలో ఓ ప్రత్యేక గీతాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. బంగారం స్మగ్లింగ్ అంశంతో ముడిపడి ఉన్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో.. రజనీ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తారు. ఆమీర్‌ఖాన్, నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్ తదితరులు కీలక పాత్రలు నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News