భారతీయ విద్యార్థిని నీలం షిండే అమెరికాలో ఫిబ్రవరి 14న రోడ్డు ప్రమాదానికి గురయింది. ఆమె చేతులు, కాళ్లు ఫ్రాక్చర్ అయ్యాయి. ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె కాలిఫోర్నియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా ఆమెను చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఆమె కుంటుంబం అమెరికా వెళ్లేందుకు భారత కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది. అందులో భాగంగా అమెరికా నుంచి కూడా స్పందన వచ్చింది. ముంబైలోని అమెరికా కాన్సులేట్ నుంచి తనకు అపాయింట్ మెంట్ కన్ఫర్మ్ అయిందని, తాను ఈ రోజు రాత్రే సతారా జిల్లాలోని ఇంటి నుంచి బయలుదేరుతున్నట్లు ఆమె తండ్రి ఎన్‌డిటివికి తెలిపారు.‘మాకు వీసా వస్తుందని ఆశిస్తున్నాము’ అన్నారు. సాధారణంగా మెడికల్ ఎమర్జెన్సీకి ప్రయాణ అనుమతులు వేగంగా ఇస్తారు.
కానీ షిండే కుటుంబం విషయంలో ఆలస్యం కావడానికి కారణం స్పష్టంగా తెలియడంలేదు. నీలం షిండే కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ విద్యార్థిని. ఫిబ్రవరి 14న వెనుకనుంచి వచ్చిన నాలుగు చక్రాల వాహనం ఆమెను ఢీకొంది. దాంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఫ్రాక్చర్లు కూడా అయ్యాయి. ఆమె కుటుంబ సభ్యులు తర్వాత 48 గంటల్లోనే వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ అది అప్పటి నుంచి పెండింగ్‌లోనే ఉంది. ఎన్‌సిపి(ఎస్‌పి) ఎంపీ సుప్రియా సూలే చేసిన సోషల్ మీడియా ‘ఎక్స్’ పోస్టు ద్వారా ఆ కుంటుంబం ఆవేదన అదరి దృష్టికి వెళ్లింది. ఈ విషయాన్ని ఆమె అంకుల్ కదమ్ షిండే తెలిపారు. వీసా లేక అత్యవసర ప్రయాణానికి అనుమతి ఇవ్వాలంటూ భారత విదేశాంగ శాఖకు చెందిన అమెరికా విభాగం అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించింది.