Wednesday, April 2, 2025

జాబిల్లి పైకి ప్రైవేట్ కంపెనీ గ్రేస్ డ్రోన్

- Advertisement -
- Advertisement -

కేప్‌కెనవెరాల్ అంతరిక్షరేసులో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేయడానికి అమెరికా కీలక చర్యలు చేపడుతోంది. మరోసారి మానవ రహిత జాబిల్లి యాత్ర చేపట్టడానికి సిద్ధమైన నాసా , అంతకంటే ముందు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం వరుసగా ప్రయోగాలు చేస్తోంది. తాజాగా చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద దిగేలా ఓ ప్రైవేట్ కంపెనీ చేసిన లూనార్ ల్యాండర్‌ను ప్రయోగించింది. దీని ద్వారా జాబిల్లిపై సూర్య కిరణాలు ఎన్నడూ పడని ఓ బిలం పైకి డ్రోన్‌ను పంపడానికి ప్రణాళిక రూపొందించింది.ఇంట్యూటివ్ మెషీన్స్ సంస్థ అభివృద్ధి చేసిన అధీనా ల్యాండర్‌ను స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌తో పంపించింది. నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి దూసుకెళ్లిన ఈ రాకెట్ … మార్చి 6న ఉపరితలంపై దిగేలా రూపొందించారు. 15 అడుగుల ఎత్తయిన ఈ అధీనా ల్యాండర్ దక్షిణ ద్రువానికి 100 మైళ్ల దూరంలో ల్యాండ్ అయ్యేలా లక్షాన్ని నిర్దేశించారు. ఈ ప్రాంతం జెట్ బ్లాక్ బిలానికి కేవలం 400 మీటర్ల దూరంలోనే ఉంటుంది. చంద్రుడిపై సూర్య కిరణాలు ఎప్పుడూ పడని ప్రాంతంగా జెట్ బ్లాక్ బిలాన్ని అభివర్ణిస్తుంటారు. ఈ బిలం పైకి గ్రేస్ అనే డ్రోన్‌ను పంపించడమే అధీనా ల్యాండర్ మిషన్ లక్షం.

కంప్యూటర్ ప్రోగ్రామింగ్ దిగ్గజం గ్రేస్ హోపర్ గుర్తుగా ఈ డ్రోన్‌కు ఆయన పేరు పెట్టారు. మూడు అడుగులు ఉండే ఈ డ్రోస్ , జాబిల్లి ఉపరితలంపై మూడు కీలక పరీక్షలు నిర్వహించనుంది. ఇందులో హైడ్రొజన్ ఇంధన ధ్రస్టర్లను ఉపయోగించారు. దీంతో డ్రోన్ ఎగురుతుంది. నావిగేషన్ కోసం కెమెరా, లేజర్లను ఏర్పాటు చేశారు. డ్రోన్ ఎగురుతుండగా, దీని లోని పరికరాలు జాబిల్లి ఉపరితలాన్ని అన్వేషిస్తాయి. ఈ ల్యాండర్‌తోపాటు ఫాల్కర్ 9 రాకెట్‌లో లూనార్ ట్రయల్ బ్లేజర్ స్పేస్‌క్రాఫ్ట్‌ను కూడా నాసా చంద్రుడి పైకి పంపించింది. ఇది చంద్రుడి కక్షలో తిరుగుతూ జాబిల్లిపై నీటి జాడను అన్వేషిస్తుందని నాసా వెల్లడించింది. చంద్రుడిపై పరిశోధనల కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. జనవరిలో అమెరికా, జపాన్ కంపెనీలు చంద్రుడి పైకి ల్యాండర్లను పంపాయి. టెక్సాస్ కంపెనీ ఫైర్‌పై ఏరోస్పేస్ మరోవారంలో చంద్రుడిపై అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రైవేట్ సంస్థల ప్రయోగాలకు నాసా మద్దతు అందిస్తోంది. చంద్రుడిపై ల్యాండర్‌ను పంపే విషయంలో గతంలో చేసిన పొరపాట్లు ఈ సారి జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటివరకు రష్యా, చైనా, అమెరికా, చైనా, భారత్, జపాన్ దేశాలు చంద్రునిపై అడుగుపెట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News