హైదరాబాద్ అన్‌స్టాపబుల్
దావోస్ పర్యటన వల్ల భారీగా
పెట్టుబడులు దిగ్గజ సంస్థలు మన
వద్దకు వస్తున్నాయి పోటీ
పొరుగు రాష్ట్రాలతో కాదు..ప్రపంచ
స్థాయి నగరాలతోనే కాంగ్రెస్
ప్రభుత్వ పనితీరుతోనే రాష్ట్రానికి
విదేశీ పెట్టుబడులు రాష్ట్రంలో
పెరిగిన కృత్రిమ మేధ వినియోగం..
అతితక్కువ ద్రవ్యోల్బణం
తెలంగాణ ఎదుగుదలను
ఆపలేమని ప్రపంచమే గుర్తించింది
హెచ్‌సిఎల్ టెక్ కొత్త క్యాంపస్
ప్రారంభోత్సవంలో సిఎం రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరని సిఎం రేవంత్ రెడ్డి అన్నా రు. తన పోటీ పొరుగు రాష్ట్రాలతో కాదని, ప్రపంచస్థాయి నగరాలతో పోటీ పడేలా ఆలోచన చేస్తున్నామన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లో హెచ్‌సిఎల్ టెక్ కొత్త క్యాంపస్‌ను సిఎం రేవంత్ రెడ్డి గు రువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరుతో రాష్ట్రానికిపెద్ద సంస్థలు వస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఉద్యో గాల కల్పనలో నెంబర్‌వన్‌గా నిలిచామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో లైఫ్ సైన్సెస్ కంపెనీ ఆమ్జేన్‌ను ప్రారంభించామని, హైదరాబాద్‌లో బయో ఏషి యా సదస్సు కూడా నిర్వహించామని ఆయన గు ర్తు చేశారు. హెచ్‌సిఎల్ టెక్ కంపెనీ దేశానికి గర్వ కారణమని ఆయన పేర్కొన్నారు. హెచ్‌సిఎల్ భా రతదేశం గర్వించేలా చేస్తోందని, 60 దేశాల్లో 2. 2 లక్షల మందితో పని చేస్తుందని ఆయన కొనియాడారు. డిజిటల్, ఇంజనీరింగ్, క్లౌడ్, ఏఐ రం గాల్లో వరల్డ్ క్లాస్ ఆఫరింగ్స్‌ను ఈ కంపెనీ క్రియే ట్ చేస్తుందన్నారు. 2007లో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన హెచ్ సిఎల్ ప్రస్తుతం భారీగా ఎదిగిందని సిఎం రేవంత్ గుర్తు చేశారు. ఇప్పుడు 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 5 వేల మందితో ప్రపంచస్థాయి సదుపాయాలతో హెచ్ సిఎల్ టెక్ హైదరాబాద్‌లో పనులు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా హెచ్‌సిఎల్ కూడా తెలంగాణలో అద్భుతంగా పని చేస్తుందని సిఎం కితాబునిచ్చారు.
రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ డాలర్ ఆర్ధిక వ్యవస్థగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని సిఎం రేవంత్ చెప్పారు. మల్టీనేషనల్, బడా కార్పొరేట్ సంస్థలతో హైదరాబాద్ వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయని, ప్రతి రోజు తాను ఈ సంస్థలతో ఎంఓయూలు, లేదా కార్యాలయాల ప్రారంభోత్సవాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అతి పెద్దమొత్తంలో పెట్టుబడులను రాబట్టగలిగామన్నారు. ఉద్యోగాల కల్పనపై ఫోకస్ పెట్టామని, ఎక్కువగా ఏఐ వినియోగాన్ని పెంచు కున్నామని, తక్కువ ద్రవోల్బణంతో ముందుకు వెళ్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణకు వస్తున్న పెట్టుబడులు, కుదుర్చుకుంటున్న ఒప్పందాలు చూశాక తెలంగాణ ఎదుగుదలను ఆపలేమని అందరు అంగీకరించక తప్పడం లేదన్నారు. తెలంగా ణలో కొత్త ఈవీ పాలసీ తీసుకువచ్చామని సిఎం రేవంత్ తెలిపారు. డేటా సెంటర్ హబ్‌గా రాష్ట్రాన్ని మార్చుతున్నా మని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకుపోతుందని తెలంగాణ రైజింగ్ అంశాన్ని తాను ప్రస్తావిస్తే తొలుత అందరూ సందేహాలు వ్యక్తం చేశారని, కానీ, ఇప్పుడు ప్రపంచమే అంగీకరిస్తుందన్నారు.
యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు యత్నం: మంత్రి శ్రీధర్‌బాబు
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని సిఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఇందుకోసమే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ వర్శిటీలో హెచ్‌సిఎల్ భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.