Friday, February 28, 2025

15% అన్‌రిజర్వుడ్ కోటాలో ఎపికి నో ఛాన్స్

- Advertisement -
- Advertisement -

వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాలపై మార్గదర్శకాలు జారీ 85శాతం సీట్లు
తెలంగాణ వారికే మిగిలిన 15శాతం కోటాలోనూ వారికి పోటీ పడే
అవకాశం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఉన్న అవకాశం తొలగింపు
తెలంగాణలో పదేళ్లు నివాసం ఉన్న వారికి, కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ రంగ
సంస్థల ఉద్యోగుల పిల్లలు, వారి భాగస్వాములకు ఈ కోటాలోనే సీట్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఇతర వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాలలో వందశాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గత ఏ డాది వరకు 15 శాతం సీట్లకు తెలంగాణతో పా టు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పోటీ పడే వా రు. తాజాగా ఈ అవకాశాన్ని ప్రభుత్వం తొలగించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యం లో వృత్తి విద్యా కోర్సులలో ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలను మార్పు చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి తెలంగాణ విద్యార్థులు మాత్రమే రాష్ట్రంలోని వృత్తి కో ర్సులలో ప్రవేశాలు పొందనున్నారు. తాజా ప్రభు త్వ ఉత్తర్వుల ప్రకారం ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆ ర్కిటెక్చర్, ఫార్మా డి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, న్యా య విద్య, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కో ర్సులలో 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు, 15 శాతం సీట్లను అన్ రిజర్వ్‌డ్ కోటా కిం ద కేటాయించారు.

కాగా, 15 శాతం అన్‌రిజర్వ్‌డ్ కోటా సీట్ల కేటాంయిపుల్లో పలు మార్పులు చేసింది. ఈ సీట్లకు నాలుగు రకాల వారు అర్హులుగా గుర్తిస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ కోటాలో తెలంగాణ స్థానికులతో పాటు 10 సంవత్సరాలు తెలంగాణలో నివాసం ఉన్న వారు, ఇతర రాష్ట్రాల్లో చదువుకున్న తెలంగాణ వారు కూడా అర్హులే. అలాగే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో, విద్యా సంస్థల్లో పని చేస్తున్న వారి పిల్లలు అర్హులు అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో, విద్యా సంస్థల్లో పని చేస్తున్న వారి జీవిత భాగ స్వాములకు సీట్లు కేటాయించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రొ.బాలకిష్టారెడ్డి సిఫార్సుల మేరకు ఉత్తర్వులు
రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం(2025-26) నుంచి ఇంజినీరింగ్, ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి లోకల్, నాన్ లోకల్‌ను నిర్ధారించేందుకు విధివిధానాల రూపకల్పనపై అధ్యయనం చేసేందుకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ నియమించిన విషయం తెలిసిందే. కాగా, కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాత కమిటీ సిఫార్సులను పరిశీలించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఇంజినీరింగ్ నోటిఫికేషన్ 2024 జూన్ 2వ తేదీ నాటికే వచ్చినందున పాత విధానంలోనే ప్రవేశాలు జరిపారు. ఈసారి మాత్రం కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రవేశాలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నాలుగేళ్ల పాటు తెంలగాణ చదివి ఉండాలి. లేదా ఏడేళ్ల చదువులో నాలుగేళ్లు తెలంగాణలో చదివిన పక్షంలో స్థానిక కోటా కింద సీట్లు పొందుతారు.

తగ్గనున్న ఎప్‌సెట్ దరఖాస్తులు
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టిజి ఎప్‌సెట్(ఇఎపిసెట్) సహా ఇతర వృత్తి విద్యా కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలకు ఈసారి దరఖాస్తులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. వృత్తి విద్యా కోర్సులలో రాష్ట్రంలో 15 శాతం సీట్లకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీ పడే అవకాశాన్ని ప్రభుత్వం తొలగించిన నేపథ్యంలో కేవలం తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోనున్నారు. గత కొన్నేళ్లుగా ప్రధానంగా 3.50 లక్షల దరఖాస్తులు వస్తుండగా, ఈసారి 2 నుంచి 3 లక్షల లోపే దరఖాస్తులు ఉండే అవకాశం ఉంది. గత ఏడాది ఎప్‌సెట్ పరీక్షకు 3,54,803 మందికి దరఖాస్తు చేసుకోగా, ఇంజినీరింగ్ విభాగానికి 2,54,543 మంది, అగ్రికల్చర్, ఫార్మా విభాగానికి 1,00,260 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.ఈసారి ఎప్‌సెట్ దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గనున్నట్లు తెలుస్తోంది.

వృత్తి విద్య సీట్ల కేటాయింపు మార్గదర్శకాలలో ముఖ్యాంశాలు

ఇంజినీరింగ్, వృత్తివిద్యలో 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకు కేటాయింపు

15 శాతం అన్‌రిజర్వ్‌డ్ కోటా సీట్ల కేటాయింపులో కొన్ని మార్పులు

15 శాతం సీట్లకు నాలుగు రకాలవారు అర్హులుగా గుర్తింపు

తెలంగాణ స్థానికులు 15 శాతం అన్‌రిజర్వ్‌డ్ సీట్లకూ అర్హులే

అన్ రిజర్వ్‌డ్ కోటా సీట్లకు ఇతర రాష్ట్రాల్లో చదివిన తెలంగాణ విద్యార్థులు అర్హులు

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో, విద్యా సంస్థల్లో పని చేస్తున్న వారి పిల్లలు

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో, విద్యా సంస్థల్లో పని చేస్తున్న వారి జీవిత భాగస్వాములకు సీట్ల కేటాయింపు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News