Friday, February 28, 2025

బిఆర్‌ఎస్ నిర్లక్షంతోనే ఎస్‌ఎల్‌బిసి ప్రమాదం

- Advertisement -
- Advertisement -

అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రాజెక్టును పట్టించుకోలేదు
టన్నెల్‌లో నీటి తొలగింపు పనులు చేపట్టలేదు డీవాటరింగ్‌కు
కనీసం కరెంట్ కూడా ఇవ్వలేదు అప్పుడే ప్రాజెక్టును
పూర్తి చేసి ఉంటే గ్రావిటీ ద్వారా 30టిఎంసిల నీళ్లు
దక్కేవి రెండుమూడు రోజుల్లో సహాయక
చర్యలు పూర్తి మూడు నెలల్లో సొరంగం
పనులు పునఃప్రారంభం : మంత్రి ఉత్తమ్

మన తెలంగాణ/ అచ్చంపేట/దోమలపెంట: ఎస్‌ఎల్‌బిసి ప్ర మాదానికి కారణం బిఆర్‌ఎస్ నిర్లక్షమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. డీ వాటరింగ్‌కు కరెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజల ఆకాంక్ష మేరకే తమ పాలన ఉంటుందని అ న్నారు బిఆర్‌ఎస్ పార్టీ సమర్థవంతంగా ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ఇప్పటికే 3 నుంచి 4 లక్షల ఎకరాలకు నీరు అందేదని
అన్నారు. హరీష్ రావుకు సిగ్గుండాలని ఆక్షేపించారు. ఆ పార్టీ హయాంలో ప్రతిపక్ష నేతలకు ప్రాజెక్టు చూసేందుకు కూడా వెళ్లనీయలేదని అన్నారు. తాము మాత్రం వారిని అలా చేయలేదని అన్నారు. దేవాదుల ప్రాజెక్టులో ఐదు మంది చనిపోతే ఐదు ఏళ్ల తర్వాత ఎముకలు బయటికి తీసిన విషయం హరీష్ రావు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టు పూర్తయితే గ్రావిటి ద్వారా 30 టిఎంసీలు తెలంగాణకు వస్తాయనే విషయాన్ని ఆయన మరిచిపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు. కాగా దేశంలోని నిష్ణాతులతో రెండు మూడు రోజుల్లో సహాయక చర్యలు పూర్తి చేపట్టనున్నట్లు, మూడు నెలల్లో తిరిగి సొరంగ పనులు ప్రారంభించనున్నట్లు ఎస్‌ఎల్‌బిసి క్యాంపు కార్యాలయం దగ్గర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అచ్చంపేట శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ, మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంత రావుతో కలిసి పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గురువారం ఉదయం దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ప్లాస్మా కటింగ్ నిష్ణాతుల బృందాన్ని చర్యల్లో భాగం చేసినట్లు సహాయక చర్యలు వేగవంతం అయ్యాయని వివరించారు.

రెండు మూడు నెలల్లో ఎస్‌ఎల్‌బిసి సొరంగ పనులను ప్రారంభించడం తన యొక్క దృఢ సంకల్పమని మంత్రి వివరించారు. ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ ప్రమాద ఘటనలో టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గన్వేషణకు ముమ్మరం చేసినట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. టన్నెల్‌లో ఉన్న నీటిని భారీ పంపులతో బయటికి పంపడం, బురదను తీసివేయడం ద్వారా డిబిఎం ముందు భాగం చేరుకోనున్నట్లు తెలిపారు. డిబిఎం చివరి భాగాలను గ్యాస్ కట్టర్లు, ప్లాస్మా కట్టర్లతో తొలగించనున్నట్లు మంత్రి వివరించారు. రెండు మూడు రోజుల్లో రెస్కూ ఆపరేషన్ పూర్తి చేయనున్నట్లు, తిరిగి సోరంగ పనులు రెండు మూడు నెలల్లో ప్రారంభించనున్నట్లు వివరించారు. ఆర్మి, నేవి, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, ర్యాట్ మైనర్స్, దక్షిణ మధ్య రైల్వే ప్లాస్మా కట్టర్స్, రాబిన్సన్ మైనింగ్ ప్రతినిధులు, మెగా, నవయుగ కంపెనీల బృందాలు నిరంతరం సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నాట్లు టిబిఎం మిషన్, శిథిలాలను, బురదను సొరంగంలో ప్రమాద స్థలం నుండి బయటకు తేవడం జరుగుతుందని తెలిపారు. ప్రమాదం జరిగినప్పటి నుండి రాష్ట్ర మంత్రులు నిరంతరం సహాయక చర్యలపై సమీక్షలు నిర్వహిస్తూ సహాయక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.

సహాయక చర్యలకు ఆటంకంగా మారిన బురద నీటిని తొలగించే ప్రక్రియను మరింత స్పీడ్ పెంచారన్నారు. దేశంలోని మైనింగ్ ప్రమాదాలలో నిష్ణాతులైన వారి సేవలను వినియోగించుకుంటూ వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ సహాయక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ సహాయక చర్యల్లో దేశంలోని మైనింగ్ రెస్కూ సిబ్బంది, ఇండియా బోర్డర్స్ ఆర్గనైజేషన్ సేవలను వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిఙ్ఞానంపై రెస్కూ టీంలు దృష్టి సారించాయని, సహాయక చర్యల్లో ఎక్కడ రాజీ పడకుండా రాష్ట్ర ప్రభుత్వం రెస్కూ టీంలకు వెసులుబాటు కల్పించిందన్నారు. ఆర్మి, నేవి, ఎన్డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, సింగరేణి కాలరీస్ అండ్ మైనింగ్ ప్రతినిధుల బృందం, ర్యాట్ మైనర్ సేవలను వినియోగించుకుని పూర్తి ప్రణాళికతో రెండు మూడు రోజుల్లో సహాయక చర్యలకు వేగవంతం చేస్తున్నట్లు వివరించారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, నాగర్‌కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్‌పి గైక్వాడ్ రఘునాథ్, టిఎస్‌ఎస్‌పిడిసిఎల్‌సి ఎండి ముషారఫ్ అలీ, ఢిల్లీ నుంచి వచ్చిన ఆర్మి అధికారులు కల్నల్ బ్లాక్ స్మిత్ మెహ్రా, జెపి కంపెని ప్రతినిధులు జరుగుతున్న సహాయక చర్యలపై ఉదయం జెపి కంపెని బేస్ క్యాంపులో సమీక్ష సమావేశం నిర్వహించారు.
బిఆర్‌ఎస్‌ది గ్లోబల్ ప్రచారం
బిఆర్‌ఎస్ వ్యవహరిస్తున్న ధ్వంద వైఖరి ఏమిటో తనకు అర్థం కావడం లేదని మంత్రి విమర్శించారు. వాళ్లది గ్లోబల్ ప్రచారంగా అభివర్ణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News