Friday, February 28, 2025

సింగపూర్ లో తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి శివాలయాల సందర్శన యాత్రను ఈ మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మూడవసారి నిర్వహించడం జరిగింది . ఈ యాత్ర ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 7 గంటల వరకు నిర్వహించారు. ఈ భక్తి యాత్ర లో బాగంగా సింగపూర్ లో ఉన్న 11-12 ప్రముఖ శివాలయాలను సందర్శించడం జరిగింది. ఈ యాత్ర నిర్వహించడానికి సింగపూర్ లోని జురాంగ్ ఈస్ట్ ,బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్- పుంగ్గోల్ మరియు టాంపనీస్-బెడోక్ ప్రాంతాల నుండి బస్సులను సమకూర్చి యాత్రను విజయవంతగా నిర్వహించడం జరిగింది. ఈ దేవాలయాల సందర్శన యాత్రలో భాగంగా వివిధ బస్సుల ద్వారా సుమారు 210 మంది భక్తులు వివిధ దేవాలయాలను సందర్శించి ఆ పరమ శివుని దీవెనలు పొందారు. ఈ శివ రాత్రి సందర్బంగా సింగపూర్ లో ఉద్యోగులకు పనిరోజు అయినప్పటికీ ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బస్సులు భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగాయి.

ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చక్కని ప్రణాళికతో సురక్షితంగా యాత్రను నిర్వహించిన సొసైటీ వారికి ఈ యాత్రలో పాల్గొన్న భక్తులు తమ సానుకూల అభిప్రాయాన్ని కృతజ్ఞతల రూపంలో వాట్సాప్ మాధ్యమంలో తెలియజేసి అభినందించారు. భక్తుల సానుకూల స్పందన కమిటీ సభ్యులను భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రోత్సహించింది. ఎలాంటి లాభాపేక్ష మరియు ఆడంబరాలు లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ సేవ మరియు భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారిని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కొనియాడారు.

Telangana Cultural Society members visit Shivalayam

ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి మరియు ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల మరియు ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము మొదలగు వారు ఉన్నారు. వీరితో పాటు యాత్రలో సహాయపడిన పెరుకు శివ రామ్ ప్రసాద్, కిరణ్ కైలాసపు, లక్ష్మణ్ రాజు కల్వ మరియు అందరికి కృతజ్ణతలు తెలియజేశారు.

ఆ పరమశివుడు తరచుగా ధ్యానంలో ఉంటారు అని నానుడి. అదేవిదంగా, ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా ఇంట్లోనే ఉండి జాగారం, ఉపవాసం చేసే భక్తుల కోసం ఈ పవిత్ర శివరాత్రి సందర్భంగా, హార్ట్‌ఫుల్‌నెస్ సింగపూర్ సహకారంతో, జూమ్ మాధ్యమంలో ఉచితంగా మెడిటేషన్ ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించడం జరిగింది. హార్ట్‌ఫుల్‌నెస్ సింగపూర్ వారికి, సమన్వయ కర్తగా వ్యవహరించిన రవి చైతన్య మైసా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల, కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ మొదలగు వారు ఈ యాత్రను ఇంత విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ భక్తి కార్యక్రమానికి సింగపూర్ లో పని రోజు అయినప్పటికీ గత సంవత్సరం లాగే ఈ సారి కూడా భారీ స్పందన వచ్చిందని, సొసైటీ చేస్తున్న వినూత్న కార్యక్రమాలకు సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్న సభ్యులకు, స్పాన్సర్స్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News