Friday, February 28, 2025

డబ్బులు రావని 200 మీటర్లే తవ్వారా? హరీష్ రావు: జూపల్లి

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూల్: బిఆర్ఎస్‌ పాలనలో ఎస్ఎల్ బిసి పనులు పెండింగ్‌ పెట్టారని మంత్రి జూపల్ల కృష్ణా రావు మండిపడ్డారు. హరీష్ రావు కామెంట్స్ కు జూపల్లి రీకౌంటర్ ఇచ్చారు. గత పది సంవత్సరాల కాలంలో కెసిఆర్ పాలనలో ఎస్‌ఎల్‌బిసిలో 200 మీటర్లు తవ్వారని, మిగతా పనులను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. తక్కువ లాభం వస్తుందని ఎస్ ఎల్ బిసి పనులు వదిలేశారా? అని చురకలంటించారు. ఎస్ఎల్ బిసి పూర్తయితే కాంగ్రెస్‌కు పేరు వస్తుందని, ఆ భయంతోనే ఎస్ఎల్ బిసి పనులు పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. తన ప్రశ్నలకు బిఆర్ఎస్ నేత హరీష్‌ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎస్ఎల్ బిసి టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ వేగవంతం జరుగుతోంది. ఏడో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
గ్యాస్‌ కట్టర్‌తో బోరింగ్‌ మెషీన్ శిథిలాల తొలగించారు. రెస్క్యూ సిబ్బంది బురద, మట్టిని లోకో డబ్బాల్లో నింపి బయటకు పంపిస్తున్నారు. భారీ మోటార్లతో టన్నెల్ నుంచి సీపేజ్ వాటర్‌ పంపింగ్ చేస్తున్నారు. గల్లంతైన కార్మికులకోసం అత్యాధునిక పరికరాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News